»   » రాయల్ స్టాగ్ తో మహేష్ బాబు మత్తు

రాయల్ స్టాగ్ తో మహేష్ బాబు మత్తు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్ : త్వరలో మహేష్ బాబు రాయల్ స్టాగ్ తో రాయల్ గా కనిపించి తన అభిమానులకు కనివిందు చేయనున్నట్లు సమాచారం. సౌత్ ఇండియాలో రాయల్ స్టాగ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ ని ఎంపిక చేసినట్లు సమచారం. గతంలో షారూఖ్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, ధోనీ,హర్బజన్ సింగ్ వంటివారు ఈ బ్రాండ్ కి అంబాసిడర్స్ గా చేసారు. ఇప్పుడు ఆ బ్రాండ్ మహేష్ ని వరించింది. త్వరలోనే ఈ యాడ్ షూటింగ్ జరగనున్నట్లు తెలుస్తోంది.

  ఇప్పటికే మహేష్ ..ఐడియా,ధమ్స్ అప్,మహేంద్రా,ప్రోవోగ్,సౌత్ ఇండియా షాపింగ్ మాల్,జాయ్ అల్లుకాస్ వంటి పాపులర్ బ్రాండ్స్ లకు అంబాసిడిర్ గా ఉన్నారు. ఈ రాయల్ స్టాగ్ కూడా కలవటంతో జాతీయ స్ధాయిలో మహేష్ ..బ్రాండ్ లకే బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగినట్లు అయ్యిందంటున్నారు. ఇప్పటి వరకు ఏ తెలుగు హీరో కూడా మహేష్ బాబు రేంజిలో యాడ్ ఫిల్మ్స్ ద్వారా సంపాదించడం లేదు. ఇటు కమర్షియల్ యాడ్లలో...మరో వైపు సినిమాల్లో సూపర్ స్టార్‌గా కొనసాగుతూ చేతి నిండా సంపాదిస్తున్నాడు.

  ప్రస్తుతం మహేష్ బాబు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటిస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో వెంకటేష్ మరో హీరోగా నటిస్తున్నారు. మహేష్ సరసన సమంత, వెంకటేష్ సరసన అంజలి నటిస్తున్నారు. వెంకీ-మహేష్ అన్నదమ్ముళ్లుగా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్ లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అన్నదమ్ముల రిలేషన్ ఈ చిత్రంలో మెయిన్‌గా ఫోకస్ కానుంది. ఈ చిత్రంతో పాటు మహేష్ బాబు సుకుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు.

  English summary
  Mahesh Babu has signed yet another brand endorsement deal, according to the latest reports. He’s going to endorse Royal Stag for the entire South Indian market. In the past, Shah Rukh Khan, Saif Ali Khan, M S Dhoni, Harbhajan Singh and various other celebrities had endorsed the brand.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more