»   » మహేష్ బాబు ఫ్యామిలీతో ఇపుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? (ఫోటోస్)

మహేష్ బాబు ఫ్యామిలీతో ఇపుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

'భరత్ అనే నేను' చిత్రం బ్లాక్ బస్ట్ హిట్ కొట్టడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫుల్ హ్యాపీ మూడ్లోకి వెళ్లిపోయారు. నిన్నమొన్నటి వరకు సినిమా ప్రమోషన్లలో బిజీగా గడిపిన ఆయన ఐదు రోజుల క్రితమే ఫ్యామిలీతో కలిసి పారిస్‌లో వాలిపోయారు. ఐఫిల్ టవర్‌తో పాటు వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ హాట్ సమ్మర్‌ను కూల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. వాస్తవానికి సినిమా రిలీజ్ ముందే పారిస్‌కు షార్ట్ హాలిడే వెళ్లి వచ్చారు మహేష్. గ్యాప్ లేకుండా సాగిన షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాలతో బుర్రహీటెక్కడంతో రిలాక్స్ అయి వచ్చిన ఆయన సినిమా హిట్ టాక్ కావడంతో పారిస్‌కు లాంగ్ హాలిడే ప్లాన్ చేసుకున్నారు.

మహేష్ బాబు, సితార

కూతురు సితారతో కలిసి పారిస్ వెళుతూ మహేష్ బాబు. ఈ ఫోటోలను మహేష్ భార్య నమ్రత ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్టు చేశారు.

పిల్లలతో కలిసి పారిస్ వీధుల్లో....

మహేష్ బాబు లాంటి స్టార్ సెలబ్రిటీలు ఇండియాలో తమ పిల్లలతో కలిసి వీధుల్లో తిరుగుతూ షాపింగ్ చేయడం అసాధ్యం. సూపర్ స్టార్ హోదాలో ఉన్నవారు ఇలాంటి చిన్న చిన్న సరదాలు తీర్చుకోవాలంటే పారిస్ లాంటి నగరాలు బెస్ట్ ఆప్షన్.

గౌతమ్, సితార

పారిస్‌లోని ఓ పర్యాటక ప్రదేశాల్లో తిరుగుతూ మహేష్ బాబు అండ్ ఫ్యామిలీ....

ఐఫిల్ టవర్ వద్ద

పారిస్‌లోని ఐఫిల్ టవర్ వద్ద కూతురు సితారలతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన నమ్రత శిరోద్కర్.

English summary
Mahesh Babu, who is currently riding high on success with the recently released film Bharat Ane Nenu, is off on a holiday to Paris. The actor has left for a mini vacation along with wife Namrata Shirodkar and kids Gautham and Sitara.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X