»   » మహేష్ ‘ఖలేజా‘ కూడా మరో ‘పులి’ అయితే...

మహేష్ ‘ఖలేజా‘ కూడా మరో ‘పులి’ అయితే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

సింగనమల రమేష్ ఈ పేరు ఇప్పుడు అందరికీ బాగా పరిచయం ఉన్నదే..ఎందుకంటే 'కొమరం పులి"ని పిల్లిని చేయడమే కాకుండా రెండేళ్లుగా కష్టపడి పనిచేసింది ఈ దిక్కుమాలిన సినిమానా! అనేంత రిజల్ట్ ని చిత్రం ఇవ్వడంతో ఈ చిత్రానికి పనిచేసిన వారందరని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దుమ్మెత్తి పోస్తున్నారు..చివరికి పవన్ కళ్యాణ్ ని కూడా...

ఇద్దరు అగ్రహీరోల డేట్స్ ని తీసుకుని వారితో చిత్రం చేయడానికి సంవత్సరాలకి సంవత్సరాలు తీసుకోవడమే కాకుండా ..సహ నిర్మాత సి కళ్యాణ్ వచ్చే వరకు ఒక్క చిత్రాన్ని కూడా విడుదల చేయలేని పరిస్థితులోనికి వెళ్లిన సింగనమలను ఇప్పుడు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా తప్పుపడుతున్నారు. 'ఖలేజా" కూడా 'పులి" రిజల్ట్ ని చవి చూడాల్సి వస్తే ..పూర్తి బాధ్యత శింగనమలే అవుతాడు..ఎందుకంటే ఎటువంటి విషయం లేని ..అలాగే ఐదు నెలల్లో, ఐదు కోట్ల రూపాయలతో తీయాల్సిన సినిమాలని సంవత్సారాలకి సంవత్సరాలు, కోటానుకోట్లు ఖర్చు పెట్టి చేయడం ..ఇటువంటి చిత్రం కోసం తొడలు చరుచుకుని మరీ అభిమానులు వేచి చూడటం వంటివి మళ్లీ రిపీట్ అయితే నిర్మాతలతో పాటు..అగ్రహీరోలు కూడా మళ్లీ సినిమాలు అనకుండా సినిమాలకు బ్రేక్ లు ఇవ్వాల్సిందే..అంత గోరంగా రగిలిపోతున్నారు పులి చిత్రం చూసిన పవన్ అభిమానులు..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu