»   »  పత్రికా ఆఫీసుపై దండెత్తిన మహేష్ ఫ్యాన్స్, రంగంలోకి పోలీసులు! (ఫోటోస్)

పత్రికా ఆఫీసుపై దండెత్తిన మహేష్ ఫ్యాన్స్, రంగంలోకి పోలీసులు! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'బ్రహ్మోత్సవం' చిత్రం విడుదలైన తొలిరోజు ప్లాప్ టాక్ తెచ్చుకన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ సినిమాపై ఎన్నో వ్యంగాస్త్రాలు పేలుతున్న సంగతి తెలిసిందే. ఇది 'బ్రహ్మోత్సవం' కాదు 'ఫ్లాపోత్సవం' అంటూ రకరకాల పేరడీలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటివి సర్వసాధారణమే, ఎప్పటి నుండో జరుగుతున్నవే....

అయితే... 'ఫ్లాపోత్సవం' పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని, సెటైర్లను ఒక కూర్పుగా చేస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ అనే ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. దీంతో మహేష్ బాబు అభిమానులు భగ్గుమన్నారు. సోషల్ మీడియాలో ఎవరో ఆకతాయిలు చేస్తున్న దుష్పచారన్ని ఇలా ప్రింటు మీడియాలో కథనంగా వేయడం ఏమిటంటూ ప్యాన్స్ అంతా కలిసి హైదరాబాద్ లోని పత్రిక ఆఫీసు మీద దండెత్తారు.

ఈ విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడు, కొందరు నేతలు మాత్రం పత్రిక ఆఫీసు అఫీషియల్స్ తో చర్చలు జరిపేందుకు పోలీసులు అనుమతించారు.

చర్చల అనంతరం ఫ్యాన్స్ అసోసియేషన్ నేతలు మాట్లాడుతూ...ఒకప్పుడు సూపర్ స్టార్ క్రిష్ణ, ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగేవి, ఇపుడు ఆ పరిస్థితులు పోయాయి. ఇపుడు అందరు హీరోల ఫ్యాన్స్ మంచి యాటిట్యూడ్ తో ఉంటున్నారు. అయితే ఎవరో ఆకతాయిలు కావాలని ఇలాంటివి చేస్తున్నారు. అలాంటి వారు చేస్తున్న దాన్ని పత్రికల్లో ప్రధానంగా ప్రస్తావించడం, సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఇలా రాయడం బాధాకరం అన్నారు. మాకు మీడియా అంటే ఎంతో గౌరవం, అయితే సోషల్ మీడియాలో కొందరు చేసే దుష్ర్పచారం ప్రింటు మీడియాలో రావడం కొంత బాధ కలిగించింది అన్నారు. మహేష్ బాబు ఎంతో సౌమ్యుడని, ఆయన ఎంత మర్యాదగా ఉంటారో, ఏ విధంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారో అందరికీ తెలుసన్నారు.

అభిమానులు ఎవరూ ఆవేశానికి లోను కావద్దని, ఎలాంటి చర్యలకు పూను కోవద్దని ఈ సందర్భంగా అభిమాన సంఘాల నేతలు పిలుపు నిచ్చారు. మహేష్ బాబు గురించి ఎవరైనా దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని ఈ సందర్భంగా అభిమాన సంఘాల నేతలు హెచ్చరించారు.

వేరే అభిమానులు జెలసీ ఫీలవుతున్నారు
ఇంత మంచి అందగాడు, ఇంత మంచి హీరో అంటూ వేరే అభిమానులు మహేష్ బాబును చూసి జెలసీ ఫీలవుతున్నారని, అందుకే ఇలా చేస్తున్నారని, ఇలా పత్రికలు ఇలాంటి కథనాలు రావడం వల్ల మా అభిమానుల్లో ప్రశాంతత చెడగొట్టినట్లవుతుందని అభిమాన సంఘం నేతలు వ్యాఖ్యానించారు.

స్లైడ్ షోలో ఫోటోస్...

మహేష్ ఫ్యాన్స్

మహేష్ ఫ్యాన్స్


‘ఫ్లాపోత్సవం' పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని, సెటైర్లను ఒక కూర్పుగా చేస్తూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ అనే ఆంగ్లపత్రిక కథనం ప్రచురించింది. దీంతో మహేష్ బాబు అభిమానులు భగ్గుమన్నారు.

దండెత్తారు

దండెత్తారు


సోషల్ మీడియాలో ఎవరో ఆకతాయిలు చేస్తున్న దుష్పచారన్ని ఇలా ప్రింటు మీడియాలో కథనంగా వేయడం ఏమిటంటూ ప్యాన్స్ అంతా కలిసి హైదరాబాద్ లోని పత్రిక ఆఫీసు మీద దండెత్తారు.

పోలీసులు

పోలీసులు


ఈ విషయం తెలిసి రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు.

చర్చలు

చర్చలు


అయితే మహేష్ బాబు అభిమాన సంఘం అధ్యక్షుడు, కొందరు నేతలు మాత్రం పత్రిక ఆఫీసు యాజమాన్యంతో చర్చలు జరిపారు.

జెలసీ ఫీలవుతున్నారు

జెలసీ ఫీలవుతున్నారు


ఇంత మంచి అందగాడు, ఇంత మంచి హీరో అంటూ వేరే అభిమానులు మహేష్ బాబును చూసి జెలసీ ఫీలవుతున్నారని, అందుకే ఇలా చేస్తున్నారని, ఇలా పత్రికలు ఇలాంటి కథనాలు రావడం వల్ల మా అభిమానుల్లో ప్రశాంతత చెడగొట్టినట్లవుతుందని అభిమాన సంఘం నేతలు వ్యాఖ్యానించారు.

English summary
Mahesh Babu Fans fires on English Daily Office as they have published an article which trolls Brahmotsavam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu