»   » అల్లు అర్జున్ కు దాసోహులౌవుతున్న ప్రిన్స్ అభిమానులు!??

అల్లు అర్జున్ కు దాసోహులౌవుతున్న ప్రిన్స్ అభిమానులు!??

Posted By:
Subscribe to Filmibeat Telugu

నేటి తరం అమ్మాయిలకు సాదా సీదా అబ్బాయిలు నచ్చడం లేదు. 'ఫేస్ వ్యాల్యూ" లేకపోయిన పర్వాలేదు కానీ కత్తిలాంటి బాడీ లాంగ్వేజి ఉండాలని మాత్రం అనుకుంటున్నారు. అమ్మాయిల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని అబ్బాయిలు కూడా జిమ్ లు, యోగాలు చేసి గట్రా చేసేసి అందం తో పాటు కండలు పెంచేస్తున్నారు. బహుశా 'కండగలవాడే గుండె గలవాడు" అని అమ్మాయిలు అనుంకుంటున్నారేమో మరి.

ఏదేమైనా అమ్మాయిల పుణ్యమా అని జిమ్ ఇన్ స్ట్రక్టర్లకు బాగా డిమాండ్ పెరిగింది. 'సిక్స్ ప్యాక్" బాడీ కోసం అబ్బాయిలు వేలకు వేలు తగలేస్తున్నారు. ఇదిలా ఉంటే సినిమా హీరోల్లో కూడా 'సిక్స్ ప్యాక్ బాఢీ పట్ల మోజు పెరిగింది. హ్యాండ్ సమ్ గా లేకపోయిన బాడీ లాంగ్వేజ్ బాగుంటే చాలు అమ్మాయిలు అభిమానులు అయిపోతున్నారు. ఇక నేటి తరం హీరోల్లో ప్రిన్స్ మహేష్ బాబు మించిన అందగాడు లేడు. అయితే హ్యాండ్ సమ్ గా అగుపించకపోయిన అల్లు అర్జున్ కే అమ్మాయిలు ఓటేస్తున్నారు. దానికి కారణమే సిక్స్ ప్యాక్ కాబోలు. ఎందుకంటే దేశముదురులో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ చేశాడు. అయితే అతని బాడీ బాగా ఎలివేట్ అయ్యింది మాత్రం 'వరుడు" పోస్టర్స్ ద్వారానే. త్వరలో విడుదలకానున్న ఈ చిత్రం పోస్టర్స్ లో అల్లు అర్జున్ పెళ్ళికొడుకు గెటఫ్ లో కనిపిస్తున్నాడు. పెళ్లి పీటల మీద కూర్చున్న ఈ వరుడుకి చాలా ఓట్లు పడుతున్నాయి. అంతే కాకుండా టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ ది కత్తిలాంటి బాడీ అని కితాబులిచ్చేస్తున్నారు.

ఇక ప్రిన్స్ మహేష్ బాబుకి అభిమానులుగా ఉన్న అమ్మాయిలు కూడా అల్లు అర్జున్ కి అభిమానులు అయిపోతున్నారు. ప్రిన్స్ అందగాడే కానీ బాడీ లాంగ్వేజ్ లేదు కదా. సో మహేష్ ఎంత అందగాడైనా కొద్దిపాటి ఇంట్రస్ట్ తో ఓపిక చేసి సిక్స్ ప్యాక్ బాడీకి మారితే, అమ్మాయిలు ఇతని వైసే మొగ్గు చూపుతారు. ఎందుకంటే అల్లు అర్జున్ కన్నా మహేష్ బాబు అందగాడు కాబట్టి. ఏదేమైనా ప్రస్తుతానికైతే కుర్రకారు మనసు మాత్రం అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ కు దాసోహులైపోతున్నారు. ఇక వరడు సక్సెస్ అయితే అల్లు అర్జున్ కు టాలీవుడ్ లో తిరుగుండదని చెప్పొచ్చు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu