»   » శ్రీమంతుడు: లుంగీలు, సైకిళ్లపై మళ్లీ మోజు

శ్రీమంతుడు: లుంగీలు, సైకిళ్లపై మళ్లీ మోజు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు సైకిల్ పై తిరుగుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ తరం యువత పాత ప్యాషన్ అంటూ లుంగీల జోలికే పోవడం లేదు. అయితే మహేష్ బాబు ‘శ్రీమంతుడు' సినిమాలో లుంగీ కట్టడంతో ఈ తరం యువత మళ్లీ లుంగీలు కట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు.

నిన్న మొన్నటి వరకు సైకిళ్లపై బయట తిరగాలంటే నామోషీగా పీలయ్యే కుర్రాకారు ఇపుడు సైకిళ్లపై వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటి ఫ్యాషన్ అనుకరిస్తూ ట్రెండీ షార్ట్స్ వేసే వాళ్లు కూడా ఇపుడు లుంగీలు కట్టుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదంతా మహేష్ బాబు ‘శ్రీమంతుడు' ఎఫెక్టే అని స్పష్టమవుతున్నారు. లుంగీ అలవాటు ఉన్న కొందరు దానితో బయటకు రావాలంటే కాస్త ఇబ్బంది పడేవారు. అంతా తమను వింతగా చూస్తారేమోనని భయపడేవారు. అయితే శ్రీమంతుడు ఎఫెక్టుతో అలాంటి వారు ఇపుడు లుంగీ ఎరగేసుకుంటూ మరీ వీధుల్లోకి వస్తున్నారు.


శ్రీమంతుడు సినిమా విషయానికొస్తే..ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. తొలి మూడు రోజుల్లోనే ఈ చిత్రం 41 కోట్లు వసూలు చేసింది. తానే స్వయంగా నిర్మాతగా మారి, సొంత ప్రొడక్షన్ ద్వారా నిర్మించిన తొలి సినిమా మంచి విజయం సాధించడంపై మహేష్ బాబు చాలా ఆనందంగా ఉన్నారట.


Mahesh Babu film effect on Youth

సినిమా విజయంపై చాలా హ్యాపీగా ఉన్న మహేష్ బాబు శ్రీమంతుడు చిత్ర టీంకు ఏదైనా బహుమతి ఇవ్వాలనే యోచనలో ఉన్నట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. గతంలో కొందరు తమిల హీరోలు, హీరోయిన్లు తమ సిబ్బందికి గోల్డ్ కాయిన్స్, వాచీలు బహుబతి ఇచ్చారు. ఇదే తరహాలు మహేష్ బాబు కూడా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని యోచిస్తున్నాడట.


ఇప్పటి వరకు మహేష్ బాబు తన కుటుంబానికి చెందిన బ్యానర్లలో నటించాడు. అయితే అవి మహేష్ బాబు బ్రదర్ రమేష్ బాబు, సిస్టర్ మంజుల నిర్వహణలో ఉండేవి. అయితే తాజాగా మహేష్ బాబు స్వయంగా ‘జి మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్ష్ ప్రై.లి' పేరుతో కొత్త బేనర్ స్థాపించి ‘శ్రీమంతుడు' సినిమాతో తనే స్వయంగా నిర్మాత అవతారం ఎత్తారు.


శ్రీమంతుడు సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా, శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. జగపతి బాబు, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు. జి మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. సొంత ఊరుకు మంచి చేయాలనే కాన్సెప్టుతో విడుదలైన ఈ చిత్రం తొలి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.

English summary
Mahesh Babu film effect on Youth.
Please Wait while comments are loading...