»   » ఫ్యామిలీతో ప్యారిస్‌కు మహేష్ బాబు.. తిరిగొచ్చేది అప్పుడే!

ఫ్యామిలీతో ప్యారిస్‌కు మహేష్ బాబు.. తిరిగొచ్చేది అప్పుడే!

Subscribe to Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ తాజాగా నటించిన చిత్రం భరత్ అనే నేను. ఈ చిత్రం ఏప్రిల్ 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల భరత్ బహిరంగ సభ పేరుతో ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా జరుపుకున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు, కొరటాల శివ కాంబినషల్ లో వస్తున్న రెండవ చిత్రం ఇది. శ్రీమంతుడు చిత్రంతో మహేష్ బాబు కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్నాడు.

Bharat Ane Nenu First Copy Report Biggest Hit Ever

కాగా భరత్ అనే నేను చిత్రం షూటింగ్ మొత్తం పూర్తయిపోవడంతో మహేష్ బాబుకు తీరిక దొరికింది. మహేష్ సినిమాలకు అంత ప్రాధాన్యత ఇస్తాడో అంతకంటే ఎక్కువగా ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇస్తాడు. ఇప్పటి వరకు బిజీగా గడిపిన మహేష్ తీరిక దొరకడంతో తన కుటుంబాన్ని ప్యారిస్ టూర్ తీసుకుని వెళ్ళాడు. ఈ ఏప్రిల్ 17 న మహేష్ తిరిగి హైదరాబాద్ వచ్చి భరత్ అనే నేను చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

Mahesh Babu flies off to Paris with family for a vacation

ఈ చిత్రంలో మహేష్ బాబు ముఖ్యమంత్రి పాత్రలో కనిపించబోతున్నాడు. భరత్ అనే నేను చిత్రంపై సర్వత్రా పాజిటివ్ బజ్ నెలకొని ఉంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

English summary
Mahesh Babu flies off to Paris with family for a vacation. He will return 17th April for movie promotion
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X