»   » మహేశ్ మహా చిలిపి.. సమంత చెప్పింది నిజమే.. బుగ్గలు పిండి ఏం చేశాడో చూడండి..

మహేశ్ మహా చిలిపి.. సమంత చెప్పింది నిజమే.. బుగ్గలు పిండి ఏం చేశాడో చూడండి..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా కోసం, ప్రేక్షకులను, అభిమానులను మెప్పించడం కోసం ప్రిన్స్ మహేశ్‌బాబు ఎంత తపన పడుతాడో తెరపైన స్పష్టం కనపడుతుంటుంది. ఎప్పటికప్పుడూ ప్రేక్షకుల అభిరుచికి తగినట్టుగా పాత్రలను ఎంపిక చేసుకోవడం, వాటి గురించి షూటింగ్‌లో సహ నటులు, దర్శక, నిర్మాతలతో చాలా సీరియస్‌గా చర్చిస్తాడనేది అందరూ చెప్పుకొంటారు. షూటింగ్‌లో బ్రేక్ దొరికితే చాలు.. చాలా సరద సరదాగా ఉంటారనేది తెలిసిందే. అందరితో కలుపుగోలుగా ఉంటూ, సూపర్‌స్టార్ అనే హోదాను మహేశ్ బాబు చూపించుకోరని నటీనటులు, సెట్లో పనిచేసే వారు చెప్తుంటారు. అలాంటి విషయాలకు బలం చేకూర్చే విధంగా స్పైడర్ సెట్లో ఓ సరదా సంఘటన జరిగింది. అదేంటో మీరే చూడండి.

మహేశ్‌బాబు గురించి సమంత..

మహేశ్‌బాబు గురించి సమంత..

ఇటీవల ట్విట్టర్‌లో సమంత అభిమానులతో ముచ్చటించిన సందర్భంగా తన తోటి నటీనటుల గురించి ఓ మాట చెప్పింది. ముఖ్యంగా సూపర్‌స్టార్ మహేశ్‌బాబు గురించి అభిమానులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ప్రిన్స్ గురించి చాలా అనేక ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది.


మహేశ్‌తో నటిస్తే ఎంజాయ్

మహేశ్‌తో నటిస్తే ఎంజాయ్

మహేశ్‌బాబు‌తో కలిసి పనిచేయడం చాలా ఎంజాయ్‌గా ఉంటుంది. సెట్ అంతా సందడి సందడిగా మారిపోతుంది. కానీ అతను షూటింగ్‌లో ఉన్నప్పడు, సీన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు గానీ ఎవరూ కూడా నవ్వకూడదు. షూటింగ్ బ్రేక్‌లో ఎంతో సరదాగా ఉంటారు. తన పనికి ఆయన చాలా కట్టుబటి ఉంటాడు. ఒకసారి షూటింగ్‌కు వస్తే దాని గురించే ఆలోచిస్తాడు అని సమంత చెప్పింది.


మురుగదాస్ ట్వీట్ చేసిన వీడియో ఇదే..

సమంత చెప్పినట్టే తాజాగా స్పైడర్‌ షూటింగ్ సందర్బంగా మహేవ్ చేసిన ఓ సరదా సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులను బాగా ఆకట్టుకొంటున్నది. సైడర్ షూటింగ్ సందర్భంగా మహేశ్ ఓ అసిస్టెంట్ డైరెక్టర్ బుగ్గలు సరదాగా పిండుతూ చాలా సంతోషంగా ఉండటం కనిపించింది. ఈ వీడియోను దర్శకుడు ఏఆర్ మురుగదాస్ షేర్ చేశాడు.


Mahesh babu fun at sets with spyder team
మహేశ్ సంతోషానికి కారణం ఏమై ఉంటుందో..

మహేశ్ సంతోషానికి కారణం ఏమై ఉంటుందో..

మహేశ్ అలా అసిస్టెంట్ డైరెక్టర్‌ను ఎందుకు ఆటపట్టించాడు? మహేశ్‌కు అంతా ముద్దొచ్చే పని ఆ వ్యక్తి చేశాడు. ప్రిన్స్‌ను చాలా సంతోషంలో ముంచిన సంఘటన ఏమై ఉంటుంది అనే ప్రశ్నలు ఫ్యాన్స్‌ను తొలిచివేస్తున్నాయి. అయితే సరదా సంఘటన వెనుక వివరాలను మురుగదాస్ వెల్లడిస్తే బాగుండేది.. మేము కూడా మహేశ్‌బాబులా హ్యపీగా ఫీలయ్యే వాళ్లం కదా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
English summary
Prince Mahesh babu is one of the funniest man in tollywood heroes. He enjoys a lot in shooting breaks of his movie. Recently Samantha also told that Working with Mahesh babu is very homely, Happy feeling. Recently in Spyder shoot, Super Star behaves like a funny moment with Assistant Director. This video shared by murugadoss.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu