twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్నికల ప్రచార అస్త్రంగా మహేష్ బాబు ‘జీఎస్టీ’ వివాదం, ఫ్యాన్స్ ఎఫెక్ట్ అవుతారా?

    |

    Recommended Video

    Mahesh Babu GST Controversy Hot Topic In AP Election Campaign | Filmibeat Telugu

    కాదేదీ ఎన్నికల ప్రచారానికి అనర్హం... అంటూ ముందుకు సాగుతున్నారు రాజకీయ నాయకులు. ఏపీ ఎన్నికల ప్రచారంలో మహేష్ బాబు 'జీఎస్టీ' వివాదం కూడా ప్రస్తావనకు వచ్చింది. గుంటూరు నుంచి లోక్ సభకు తెలుగు దేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న గల్లా జయదేవ్ తన ఎన్నికల ప్రచారంలో తన బావమరిది, ప్రముఖ మహేష్ బాబు ప్రస్తావన తీసుకొచ్చారు.

    ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా లోక్ సభలో మాట్లాడటం వల్లే తనను టార్గెట్ చేశారని, తన లెక్కలు, టాక్స్ వివరాలు పక్కాగా ఉండటంతో కుటుంబ సభ్యులను, బంధువులను, స్నేహితులను టార్గెట్ చేశారని, మహేష్ బాబుకుపై ఐటీ దాడులు జరుగడం, జీఎస్టీ వివాదం వెనక కారణం అదే అని జయదేవ్ ఆరోపించారు. టీడీపీ నేత నారా లోకేష్ కూడా మహేష్ బాబు జీఎస్టీ వివాదాన్ని తన ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించారు.

    మహేష్ బాబు అభిమానులపై ప్రభావం చూపుతుందా?

    మహేష్ బాబు అభిమానులపై ప్రభావం చూపుతుందా?

    మహేష్ బాబు జీఎస్టీ ఇష్యూను తెరపైకి తీసుకురావడం వల్ల ఆయన అభిమానులు, మద్దతుదారుల ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇలా ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది.

    మహేష్ బాబు జీఎస్టీ వివాదం ఏమిటి?

    మహేష్ బాబు జీఎస్టీ వివాదం ఏమిటి?

    మహేష్ బాబుకు చెందిన ఏఎంబీ సినిమాస్‌ థియేటర్‌లో ప్రేక్షకుల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేసినట్లు ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఆరోపణలు వెళ్లువెత్తాయి. ఈ ఆరోపణలు రావడానికి కారణం... జనవరి 1 నుంచి జీఎస్టీ రేట్లు ప్రభుత్వం తగ్గించినప్పటికీ ఏఎంబీ సినిమాస్‌ వారు పాత రేట్లు కొనసాగించడమే. ‘ఎఎంబి సినిమాస్' వారు పాత జీఎస్టీ రేట్లనే కొనసాగించడం వల్ల అదనంగా రూ. 35.66 లక్షలు వసూలు చేశారు. నిర్వహణ లోపం వల్లే ఇలా జరిగినట్లు అప్పట్లో వార్తలు వినిపించాయి..

    వెనక్కి ఇచ్చేశారు

    వెనక్కి ఇచ్చేశారు

    ఎఎంబి సినిమాస్ యజమానులు మహేష్ బాబు, సునీల్ నారంగ్ తమది కాని లాభాన్ని గుర్తించి... జీఎస్టీ రూపంలో అదనంగా వచ్చిన రూ. 35.66 లక్షలు తిరిగి ఇచ్చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆ మొత్తాన్ని వినియోగదారుల సంక్షేమ నిధికి చెల్లించడం హాట్ టాపిక్ అయింది.

    జీఎస్టీ కమీషనరేట్ ప్రశంసలు

    జీఎస్టీ కమీషనరేట్ ప్రశంసలు

    తమది కాని లాభాన్ని తిరిగి చెల్లించడంపై మహేష్ బాబు, సునీల్ నారంగ్‌పై జిఎస్టీ హైదరాబాద్ కమీషనరేట్ అప్పట్లో ప్రశంసలు గుప్పించింది. దేశంలో ఇప్పటి వరకు ఎవరూ ఇలా బాధ్యతగా జిఎస్టీ వెనక్కు ఇవ్వలేదని, మహేష్ బాబు, సునీల్ నారంగ్ అందరికీ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్న సంగతి తెలిసిందే.

    English summary
    Mahesh Babu GST controversy hot topic in AP election campaign. Nara Lokesh has hit out at BJP for slapping false cases against TDP and supporters. Nara Lokesh, Galla Jauydev said They are also creating inconvenience to actor Mahesh Babu in the name of GST.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X