»   » టీజర్‌ చాలా బాగుంది: మహేష్ బాబు

టీజర్‌ చాలా బాగుంది: మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సుకుమార్‌ నిర్మాణ సారథ్యంలో రూపొందుతున్న 'కుమారి 21 ఎఫ్‌' చిత్రం టీజర్‌ చాలా బాగుందంటూ.. టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు ప్రశంసించారు.

mahesh twitter

ఈ ట్రైలర్‌ను వీక్షించిన మహేశ్‌ చిత్ర బృందానికి, సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ప్రముఖ దర్శకుడు సుకుమార్‌కి అభినందలు తెలిపారు.ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి అందించిన రత్నవేలుని ప్రత్యేకంగా అభినందించారు.


ఉయ్యాల జంపాల ఫేమ్‌ రాజ్‌తరుణ్‌ హీరోగా, హెబ్బాపటేల్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి సూర్య ప్రతాప్‌ దర్శకుడు. దేవీశ్రీ సంగీతం అందిస్తున్నారు. శుక్రవారం ఎన్టీఆర్‌ ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.


దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి తెరకెక్కిస్తున్న చిత్రం ‘కుమారి 21 ఎఫ్'. నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు కూడా ఆయనే అందిస్తున్న ఈ చిత్రానికి పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


సుకుమార్ మాట్లాడుతూ ఇదొక వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం. నేటి యూత్‌తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే అంశాలు ఇందులో వున్నాయి. దేవిశ్రీప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తుంది. రాజ్ తరుణ్ పాత్ర, అభినయం అందర్ని ఆకట్టుకునే విధంగా వుంటుంది అని తెలిపారు. దసరా కానుకగా చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


sukumar

రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కౄష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్, సమర్పణ: సుకుమార్, నిర్మాతలు: విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి,కథస్కీన్‌ప్లే-మాటలు: సుకుమార్, దర్శకత్వం: పల్నాటి సూర్య ప్రతాప్.

English summary
"The teaser of kumari 21F is impressive. top notch work by Rathnavelu sir and DSP. Wishing Sukumar garu & the entire team all the very best :)" (sic), posted Superstar Mahesh, on his micro blogging site this afternoon.
Please Wait while comments are loading...