»   » మళ్లీ చేద్దాం: సుకుమార్‌కు మహేష్ ఎస్ఎంఎస్

మళ్లీ చేద్దాం: సుకుమార్‌కు మహేష్ ఎస్ఎంఎస్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahesh Babu - Sukumar
హైదరాబాద్: '1 నేనొక్కడినే' సినిమా బాక్సాఫీసు వద్ద అనుకున్న ఫలితాలు సాధించలేక పోయినా......దర్శకుడు సుకుమార్‌తో మరోసారి కలిసి పని చేయాలని ఆశ పడుతున్నాడు మహేష్ బాబు. ఈ విషయాన్ని సుకుమార్ స్వయంగా వెల్లడించారు. సో....మహేష్ బాబుకు సుకుమార్ పని తీరు బాగా నచ్చిందన్నమాట.

'సినిమా విడుదలైన తర్వాత మహేష్ నుండి మెసేజ్ వచ్చింది. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలు పెడదామని అడిగారు. మహేష్ బాబు లాంటి హీరో మళ్లీ నాతో పని చేయాలని కోరుకోవడం చాలా సంతోషమైన విషయం. నేను కూడా ఆయనతో కలిసి మళ్లీ పని చేయాలని కోరుకుంటున్నాను. అయితే ప్రస్తుతానికి నా వద్ద స్క్రిప్టు రెడీగా లేదు. వీలైనంత త్వరగా ఆయనతో మరో సినిమా చేస్తా' అని సుకుమార్ తెలిపారు.

మరో వైపు మహేష్ బాబు తన ట్విట్టర్లో '1 నేనొక్కడినే' చిత్రం గురించి వ్యాఖ్యానిస్తూ....తన కెరీర్లో ఈచిత్రం మోస్ట్ మెమోరబుల్ చిత్రం' అని పేర్కొన్నారు. రోటీన్‌ చిత్రాలకు భిన్నంగా వుండాలని వన్‌ చిత్రంలో నటించినట్టు హీరో మహేష్‌బాబు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో క్రితి సానన్ హీరోయిన్‌గా నటించింది. మహేష్ తనయుడు గౌతం కృష్ణ ఈ చిత్రంతో బాల నటుడిగా తెరంగ్రేటం చేసాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకరలు ఈచిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ అనే బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ కూడా ఈచిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంది.

English summary
Superstar Mahesh Babu, who teamed up with filmmaker B. Sukumar in recently released Telugu psychological thriller "1: Nenokkadine", has expressed his eagerness to work with the latter in future.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu