»   » మహేష్ ఖలేజా కి ఓకే చెప్పి ‘యు/ఎ’ ఇచ్చిన సెన్సార్ బోర్డ్...

మహేష్ ఖలేజా కి ఓకే చెప్పి ‘యు/ఎ’ ఇచ్చిన సెన్సార్ బోర్డ్...

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగు ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్న ప్రిన్స్‌ మహేష్‌బాబు తాజా చిత్రం 'మహేష్‌ ఖలేజా" సోమవారం సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న మహేష్ బాబు నటించిన 'ఖలేజా" కి ఎట్టకేలకు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని ఫ్యాన్స్ సంభరాలు మొదలెట్టారు. హైదరాబాద్ లోని రీజనల్ సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 'యు/ఎ" సర్టిఫికెట్ ఇచ్చింది. కారణం ఇందులో ఉన్న వయొలెన్స్ సీన్లే. సెన్సార్ బోర్డ్ కొన్ని కట్స్ కూడా చెప్పిందట. అందులో 3 మైనర్ కట్సే అంటున్నారు. 16రీల్స్ లెగ్త్ గల ఈ సినిమా రెండున్నర గంటలకు పైగా నిడివి ఉంది. ఈ సినిమా ఈ నెల 7న విడుదల కానున్న విషయం విదితమే. ఈ చిత్రం పై మహష్ తో పాటు అభిమానులు చాలా ఎక్స్ పెక్టేషన్స్ తో ఉన్నారు. ఇందులో మహేష్ బాబు టాక్సీ డైవర్ గా నటించగా..అనుష్క బంగారం అనే పాత్రలో నటించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్వకత్వంలో ఈ చిత్రం రూపొందిన విషయం తెలిసిందే.

ఈ చిత్రం ఈనెల 7వ విడుదలవగానే మహేష్ బాబు నెక్స్ట్ మూవీ దూకుడు షూటింగ్ అక్టోబర్ 14 నుండి టర్కీలో మొదలవనుంది. ఈ చిత్రానికి దర్శకుడు శ్రీను వైట్ల, దూకుడికి తమన్. యస్ సంగీతాన్ని అందిచనున్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu