»   » మహేష్ బాబు కూతురు రాఖీ కట్టింది: టాలీవుడ్ క్యూటెస్ట్ రాఖీ ఫర్ గౌతమ్(ఫోటోలు)

మహేష్ బాబు కూతురు రాఖీ కట్టింది: టాలీవుడ్ క్యూటెస్ట్ రాఖీ ఫర్ గౌతమ్(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

సితార అంటే మహేష్ బాబుకు ప్రాణం. కూతురును తన ఇంటి మహాలక్ష్మిగా భావిస్తూ ఉంటారాయన. మహేష్ బాబు ఎంత బిజిగా ఉన్న మొదటి ప్రాధాన్యత ఇచ్చేది మాత్రం కుటుంబంతో గడపడానికే. నిండా నాలుగేళ్లు కూడా నిండక ముందే సితార సినిమా సెలబ్రిటీ అయింది.

మన పద్దతులు, సంప్రదాయాలు

మన పద్దతులు, సంప్రదాయాలు

మహేష్ బాబు, నమ్రత తమ పిల్లలతో ఎప్పుడూ విదేశాల్లో విహరిస్తుంటారు. మోడ్రన్ జీవన శైలికి అలవాటు పడిన వారు తమ పిల్లలకు మన పద్దతులు, సంప్రదాయాలు నేర్పిస్తున్నారో? లేదో అని కొందరు అనుమాన పడుతుంటారు. కానీ నమ్రత ఈ విషయంలో చాలా శ్రద్ద తీసుకుంటున్నారనే విషయం చాలా మందికి తెలియదు.

పిల్లల బాధ్యతలు

పిల్లల బాధ్యతలు

ఇంటి బాధ్యతలు, పిల్లల బాధ్యతలు స్వయంగా చూసుకుంటున్న నమ్రత.... వారి పిల్లలకు మన సాంప్రదాయాలు కూడా అలవడేలా పెంచుతున్నారు.మన సాంప్రదాయాలు నేర్పడంతో పాటు...అన్ని మతాలు సమానమే అనే భావనను వారిలో పెంపొందిస్తున్నారు.

రాఖీ వేడుకను కూడా

రాఖీ వేడుకను కూడా

వినాయక చవితి విడుక సందర్భంగా మహేష్ బాబు ఇంట్లో వినాయకుడు కొలువుదీరుతాడు. దసరా, దీపావళికి ఇంట్లో సెలబ్రేషన్స్ గ్రాండ్ గా నిర్వహిస్తుంటారు. దీంతో పాటు క్రిస్ మస్ కూడా సెలబ్రేట్ చేస్తుంటారు.ఇదే త‌ర‌హాలో ఇద్ద‌రు చిన్నారి సెల‌బ్రిటీలు రాఖీ వేడుకను కూడా సెల‌బ్రేట్ చేశారు.

క్యూట్ ఫొటోలు

క్యూట్ ఫొటోలు

ఆ క్యూట్ ఫొటోలు ట్విట్ట‌ర్ లో వైర‌ల్ అయ్యాయి. ప్రిన్స్ మహేశ్ బాబు లిటిల్ ప్రిన్సెస్ సితార‌, కుమారుడు గౌత‌మ్ ల రాఖీ పండుగ ఫొటోలను మ‌హేశ్ భార్య‌ న‌మ్ర‌త త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సితారకు సోషల్ మీడియాలో స్పెషల్ క్రేజ్ ఉంది. అమ్మడు ఫోటోలకు నెటిజన్లు బ్రహ్మరథం పడతారు. గతంలో మహేష్ ముక్కుపై వేలేస్తూ సితార ఫోటోకు లైక్స్, షేర్స్ అదిరాయి. ఆపై సితారకు సంబంధించి ఏ ఫోటో వచ్చినా సోషల్ మీడియాలో వైరలే.

మరో అద్భుతమైన సంవత్సరం

మరో అద్భుతమైన సంవత్సరం

తన ముద్దుల కుమార్తె సితార, కుమారుడు గౌతమ్ ల రాఖీ ఫొటోలపై న‌మ్ర‌త‌ చ‌క్క‌టి కామెంట్ కూడా చేశారు. ‘ప్రేమ, అనుబంధం, ఐక్యతతో మరో అద్భుతమైన సంవత్సరం' అని ట్వీట్ చేశారు. గౌతమ్ కాళ్ల‌కు మొక్కుతూ సితార‌ ఆశీర్వాదం తీసుకుంది. సితార త‌ల‌పై అక్షింత‌లు వేస్తూ గౌత‌మ్ సిగ్గుప‌డుతున్నాడు.

బహుమతులు

సితార‌, గౌత‌మ్ లు బహుమతులు ఇచ్చి పుచ్చుకున్నారు. ఈ క్యూట్ ఫొటోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అయ్యాయి. స్పైడ‌ర్ లోని బూమ్ బూమ్ పాట‌ను లిటిల్ ప్రిన్సెస్ సితార కారులో హ‌మ్ చేస్తున్న వీడియోను ప్రిన్స్ మ‌హేశ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. 'తను ఈ పాటను రిపీట్ మోడ్ లో వింటూనే ఉంది. ఇదే తన కొత్త ఫేవరెట్ సాంగ్' అని ఆ లిటిల్ ప్రిన్సెస్ పై కామెంట్ పెట్టాడు మహేశ్‌.

English summary
In tollywood, who could be the cutest brother-sister duo other than Gautham-Sitara, In the pics, cute Sitara is seen tying rakhi to Gautham, of course with the guidance of doting mom Namrata.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu