For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  క్రిష్ తో మహేష్ బాబు చిత్రం...డిటేల్స్

  By Srikanya
  |

  వేదం, గమ్యం చిత్రాలతో తనకంటూ ముద్ర వేసుకున్న దర్శకుడు క్రిష్.ఆయన తాజాగా మహేష్ బాబు ఓ చిత్రం కమిటయ్యారని సమాచారం.గతంలో తెలుగులో అనేక సూపర్ హిట్స్ ఇచ్చిన ఓ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్ధ ఈ చిత్రాన్ని నిర్మించనుందని చెప్తున్నారు. ఈ మేరకు టాక్స్ జరుగుతన్నట్లు వినికిడి. ఓ ఇంగ్లీష్ దినపత్రిక ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. క్రిష్ నేరేట్ చేసిన కథను విన్న మహేష్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్తున్నారు. అయితే తన డేట్స్ కోసం కొంతకాలం పాటు వెయిట్ చేయాల్సి ఉంటుందని, వచ్చే సంవత్సరం చివరి వరకూ ఖాళీ దొరకకపోవచ్చునని సూచించినట్లు చెప్తున్నారు. ఇక ప్రస్తుతం మహేష్ బిజినెస్ మేన్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

  ఆ సినిమా తర్వాత వెంకటేష్‌తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేస్తారు. వాటి తర్వాత ఈ సినిమా మొదలు కావచ్చని చెప్తున్నారు. రానా హీరోగా క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రం నవంబర్‌లో మొదలు కానుంది. ఆ సినిమా తర్వాత క్రిష్ చేసే సినిమా మహేష్‌దే అవుతుందని తెలుస్తోంది.అలాగే ఈ చిత్రాన్ని పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గానూ, మహేష్‌ని కొత్త యాంగిల్‌లో క్రిష్ ప్రెజెంట్ చేయనున్నారని చెప్తున్నారు.. మహేష్ కెరీర్‌లోనే కాక క్రిష్ కెరీర్‌లో కూడా ఈ సినిమా ఓ మెమరబుల్ మూవీగా నిలిచిపోతుందని ఫిలింనగర్ నగర్ లో టాక్. ఇంక సుకుమార్ దర్శకత్వంలో కూడా మహేష్ నటించనున్నారు. ఈ రెండు చిత్రాల్లో ఏది ముందు మొదలవుతుందో తెలుసుకోవాలంటే... ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

  ఇక మహేష్ తాజా చిత్రం ది బిజెనెస్ మ్యాన్ విషయానికి వస్తే..ఈ చిత్రం నేపధ్యం ముంబై మాఫియాలోని ఆయుధాల వ్యాపారం..కొనుగోళ్ళు ..అమ్మకాల చుట్టూ తిరగనుందని తెలుస్తోంది.ముంబైలోనే ఎక్కువ బాగం షూట్ చేయాలని పూరీ భావిస్తున్నారు.గన్స్ నీడ్స్ నో ఎగ్రిమెంట్స్ అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రం పూర్తిగా స్టైలిష్ గా సాగే యాక్షన్ ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు.ఇక ఈ చిత్రం ముంబై మాఫియాకి చెందిన కథగా తెరకెక్కుతోంది. 'బిజినెస్‌మ్యాన్‌'గా టైటిల్‌కు తగిన పాత్ర అది. పోకిరి తర్వాత అంతటి హిట్‌ ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాం అంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాధ్. ఆర్.ఆర్.మూవీస్ పతాకంపై ఆయన రూపొందించబోయే చిత్రం గురించి మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని అందివ్వాలని దర్శక,నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.అలాగే ఈ చిత్రంలో తొలిసారిగా కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంగీతం: థమన్, ఛాయాగ్రహణం: శ్యామ్.కె.నాయుడు, కళ: చిన్నా, ఫైట్స్: విజయ్, ఎడిటింగ్: ఎస్.ఆర్.శేఖర్, సహనిర్మాత: వి.సురేష్‌రెడ్డి, నిర్మాత: డా.వెంకట్, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు- దర్శకత్వం: పూరి జగన్నాథ్.

  English summary
  Mahesh Babu was impressed by the story narrated by Krish. After hearing his narration, the actor has accepted the proposal and has given the ok signal.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X