»   » ప్లాప్ అయితే బాధ్యత నాదే (మహేష్ బాబు ఇంటర్వ్యూ)

ప్లాప్ అయితే బాధ్యత నాదే (మహేష్ బాబు ఇంటర్వ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు తన తాజా సినిమా ‘శ్రీమంతుడు'పై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. సినిమా సూపర్ హిట్ అవుతుందని నమ్ముతున్నాడు. తాజాగా ఆయన ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంట్వ్యూలో శ్రీమంతుడు సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు తన గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

శ్రీమంతుడు నా మనసుకు నచ్చిన కథ. ఓ కొత్త కథని డిఫరెంట్‌గా ప్రజెంట్‌ చేశారు. కథని చెప్పే విధానంలోనే కమర్షియల్‌ అంశాలున్నాయి. అందుకే కథ వినగానే... 'ఓకే' చెప్పేశా. నా కెరీర్‌లో ఇదో మంచి చిత్రం అవుతుందన్న నమ్మకం కథ వినగానే కలిగింది. సినిమా విడుదలకు ముందు ఎప్పుడూ లేనంత నమ్మకంతో ఉన్నాను అని మహేష్ బాబు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.


కథానాయకులు సినిమా నిర్మాణంలో భాగస్వాములు కావడం వల్ల బడ్జెట్ అదుపులో ఉంటుందని మహేష్ బాబు అభిప్రాయ పడ్డారు. ఈ సినిమాలో నేనో నిర్మాణ భాగస్వామిని. నా ప్రతి సినిమాకీ బాధ్యతగానే పనిచేస్తా. నా సొంత బేనర్ ఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సినిమాలు తీస్తాం. బయట హీరోలతో సినిమాలెప్పుడు అనేది ఇప్పుడే చెప్పలేను అన్నారు.


ప్లాప్ అయితే బాధ్యత నాదే

ప్లాప్ అయితే బాధ్యత నాదే

1', 'ఆగడు' సినిమాలు నిరాశ పరిచాయి. హిట్, ప్లాప్ అనేది మన చేతుల్లో ఉండదు. ప్రతి సినిమాకు బాధ్యతగానే పని చేస్తా, ప్రతి సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తాను. సినిమా అటూ ఇటూ అయితే పూర్తి బాధ్యత నేనే తీసుకొంటా. ఎందుకంటే కథల ఎంపిక పూర్తిగా నా నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. కథల ఎంపిక విషయంలో ఎవరి మాట వినను, సలహాలు తీసుకోను. అందుకే నా పరాజయాలకు బాధ్యుడ్ని కూడా నేనే అన్నారు మహేష్ బాబు.


ప్రయోగాల గురించి

ప్రయోగాల గురించి

నా కెరీర్‌లో ప్రయోగాలు ఎక్కువే. నాని, '1' అలాంటివే. కానీ వర్కవుట్‌ కాలేదు. సినిమా అనేది కోట్ల వ్యాపారం. ప్రయోగాల పేరుతో కమర్షియల్‌ విలువలకు దూరంగా వెళ్లకూడదు. ఇక మీదటా కొత్త కథల్ని ఎంచుకొంటా.. కానీ వాటిలో కమర్షియల్‌ యాంగిల్‌ కూడా ఉంటుంది. శ్రీమంతుడు సినిమా అలాంటిదే అన్నారు మహేష్ బాబు.


నో రీమేక్

నో రీమేక్

'రీమేక్‌ల జోలికి వెళ్లకూడదని ఎప్పుడో గట్టిగా నిర్ణయం తీసుకొన్నా. ఇప్పుడు కూడా అదే మాటకు కట్టిబడి ఉన్నా అని మహేష్ బాబు స్పష్టం చేసారు.
సరదాలూ.. సంతోషాలు


నిరాడంబరంగా

నిరాడంబరంగా

''సాధారణ జీవితం గడపడం అంటేనే నాకు ఇష్టం. ఆడంబరాలకు పోను. సినిమాలు తప్ప ఇంకో టైమ్‌ పాస్‌ లేదు. ఖాళీ ఉంటే సినిమాలు చూస్తుంటా. పిల్లలతో గడపడంలో బోల్డంత ఆనందం ఉంది. షూటింగ్‌ నుంచి సరాసరి ఇంటికొస్తా. పిల్లలతో టైమ్‌ పాస్‌ అయిపోతుంది. గౌతమ్‌ గుడ్‌ బోయ్‌.. అదే సితార అనుకోండి.. అల్లరే అల్లరి'' అన్నారు మహేష్.


బాహుబలి

బాహుబలి

''బాహుబలి సినిమా గొప్పగా ఉంది. తెలుగు సినిమా మార్కెట్‌ పెరిగింది. 'రుద్రమదేవి' ట్రైలర్‌ బాగా నచ్చింది. బాహుబలి లాంటి సినిమాల వల్ల అమాంతంగా అనూహ్యమైన మార్పులేమీ వచ్చేయవు. రాబోయే స్టార్‌ హీరోల సినిమాలకు కనీసం రూ.10 కోట్ల మార్కెట్‌ పెరుగుతుంది కావచ్చన్నారు.


అభ్యంతరం లేదు

అభ్యంతరం లేదు

'భజరంగ్‌ భాయిజాన్‌', 'పీకే'లాంటి సినిమాలు తెలుగులో రావడం దర్శకులు, రచయితల చేతుల్లో ఉంటుంది. అలాంటి కథలు వస్తే... నటించడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు'' అన్నారు మహేష్.


English summary
Mahesh Babu latest interview about 'Srimanthudu'.
Please Wait while comments are loading...