»   » బావ కోసం మహేష్ బాబు మరోసారి...

బావ కోసం మహేష్ బాబు మరోసారి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్స్ ఆడియో వేడుకలకు హాజరైతే ఆయా సినిమాలకు పబ్లిసిటీ పరంగా ప్లస్సవుతుంది. అందుకే వీలైనప్పుడల్లా మహేష్ బాబు నిర్మాతల ఆహ్వానం మేరకు ఆడియో ఫంక్షన్లకు హాజరవుతుంటారు. తన ఫ్యామిలీ నుండి వచ్చే హీరోల సినిమాల కోసం కూడా మహేష్ బాబు గెస్ట్ గా వస్తుండటం చూస్తూనే ఉన్నాం.

తాజాగా మహేష్ బాబు తన బావ సుదీర్ బాబు నటిస్తున్న ‘భలే మంచి రోజు' ఆడియో వేడుకకు హాజరు కాబోతున్నారు. నవంబర్ 25న ఈ మూవీ ఆడియో వేడుక నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మహేష్ బాబు రావడం వల్ల సినిమాకు పబ్లిసిటీ పరంగా ప్లస్సవుతుందని భావిస్తున్నారు.

Mahesh Babu to launch Bhale Manchi Roju audio

'ప్రేమ కథా చిత్రం', సుధీర్‌ బాబు హీరోగా, వామిఖ హీరోయిన్‌గా చేస్తున్న చిత్రం 'భలే మంచి రోజు'. ఈ చిత్రం కథాంశం అంతా ఒక్క రోజులో జరిగేది. ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలతో, వినోద భరితంగా తెరకెక్కుతోంది. 0ఎం.ఎం. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై విజరు కుమార్‌ రెడ్డి, శశిథర్‌రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీరామ్‌ ఆధిత్యని దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 'ఉత్తమ విలన్‌', 'విశ్వరూపం2' చిత్రాలకి ఛాయాగ్రహణం అందించిన షామ్‌దత్‌ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫి అందించారు. సన్ని.ఎమ్‌.ఆర్‌ ఈ చిత్రానికి బాణీలు అందించారు.

ఈ చిత్రానికి కెమెరా- షామ్‌ద‌త్‌, సంగీతం- స‌న్ని.య‌మ్‌. ఆర్‌, ఆర్ట్‌- రామ‌కృష్ణ‌, మాట‌లు-అర్జున్ అండ్ కార్తిక్‌, ఎడిటింగ్‌-యమ్‌.ఆర్‌.వ‌ర్మ‌, పి.ఆర్‌.వో- ఏలూరు శ్రీను, కో-డైర‌క్ట‌ర్- శ్రీరామ్‌ రెడ్డి, నిర్మాత‌లు-విజ‌య్‌కుమార్ రెడ్డి, శ‌శిధ‌ర్ రెడ్డి, ద‌ర్శ‌క‌త్వం- శ్రీరామ్ ఆదిత్య‌.

English summary
As per the latest update from the Bhale Manchi Roju film’s team, Bhale Manchi Roju will have its audio launch on 25th November and super star Mahesh Babu will be the chief guest.
Please Wait while comments are loading...