»   » అభిమానులతో మహేష్ బాబు ఫేస్‌బుక్ లైవ్ చాట్

అభిమానులతో మహేష్ బాబు ఫేస్‌బుక్ లైవ్ చాట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు తన అభిమానులకు సూపర్ ఛాన్స్ ఇచ్చాడు. తనతో లైవ్ చాట్ లో పాల్గొనే అవకాశం కల్పించాడు. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు తన ఫేస్ బుక్ అఫీషియల్ పేజీలో లైవ్ చాట్ చేయండి, మీ ప్రశ్నకు సమాధానం ఇస్తాను అంటూ ప్రకటించారు. మరి ఇంకెందుకు ఆలస్యం శ్రీమంతుడు సినిమాకు సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నా, త్వరలో ప్రారంభం కాబోయే ‘బ్రహ్మోత్సవం' సినిమా గురించి ఏదైనా డౌట్స్ ఉంటే మహేష్ బాబును అడగండి.

Ready with your questions? Start putting them up in the comments and I'll answer as many as possible from 3.30 pm onward. #AskSrimanthudu

Posted by Mahesh Babu onTuesday, August 18, 2015

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు' సినిమా బాక్సాఫీసు వద్ద దూసుకెలుతోంది. తిలివారంలోనే ఈ చిత్రం 66 కోట్లకు పైగా షేర్ సాధించి ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్య పరిచింది. ఈసినిమా రూ. 100 కోట్ల షేర్ సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు.

Mahesh Babu Live chat with Fans

త్వరలో మహేష్ బాబు తర్వాతి సినిమా ‘బ్రహ్మోత్సవం' ప్రారంభం కానుంది. ‘బ్రహ్మోత్సవం' చిత్రం అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని, ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా ఈ చిత్రం ఉంటుందని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెలిపారు. సెప్టెంబర్ నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని ఆయన స్పష్టం చేరారు.

మహేష్‌బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పీవీపీ బ్యాన‌ర్‌పై పొట్లూరి వ‌ర‌ప్ర‌సాద్ ‘బ్రహ్మోత్సవం' సినిమా నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు మహేష్ బాబుకు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో హిట్ అందించిన దర్శకుడు కావడంతో ‘బ్రహ్మోత్సవం' సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

English summary
"Ready with your questions? Start putting them up in the comments and I'll answer as many as possible from 3.30 pm onward." Mahesh Babu.
Please Wait while comments are loading...