»   » మహేష్ స్టైల్, లుక్ ఓ రేంజిలో అదుర్స్ (వీడియో)

మహేష్ స్టైల్, లుక్ ఓ రేంజిలో అదుర్స్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పటికే థమ్సప్, టీవీఎస్, టాటాస్కై, ప్యారగాన్.. వంటి ప్రముఖ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మహేష్, తాజాగా ఇంటెక్స్ మొబైల్స్‌కు తెలుగునాట బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించేందుకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇంటెక్స్ సంస్థ ఈ మేరకు మహేష్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఓ యాడ్ ని షూట్ చేసి రిలీజ్ చేసింది. ఈ యాడ్ లో మహేష్ స్టైల్ ని చూసి ఆయన అభిమానులు మురిసి పోతున్నారు. ఆ యాడ్ ని మీరూ చూడండి.


టాలీవుడ్ సంచలనంగా నిలిచి కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న మహేష్ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటంతో తమ స్మార్ట్‌ఫోన్‌లకు యువత మరింత కనెక్ట్ అవుతారని ఇంటెక్స్ టెక్నాలజీ డైరెక్టర్ కేశవ్ బన్సాల్ తెలిపారు. అందుబాటు ధరల్లో బెస్ట్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌లను ఆఫర్ చేస్తూ నమ్మకమైన బ్రాండ్‌గా అవతరించిన ఇంటెక్స్‌తో చేతులు కలపటం సంతోషంగా ఉందని మహేష్ అన్నారు.
mahesh-intex

మహేష్ తాజా చిత్తరం 'బ్రహ్మోత్సవం' విషయానికి వస్తే...


శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న 'బ్రహ్మోత్సవం' చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో బుధవారం ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. రాజు సుందరం మాస్టర్‌ నేతృత్వంలో సంగీత్‌ పాటను మహేష్‌బాబు, ప్రణీత, నరేష్‌, రావు రమేష్‌, జయసుధ, తులసి... ఇలా 21 మంది నటులపై తెరకెక్కిస్తున్నారు.


అక్కడ అంతా ఒకటే సందడిగా ఉంది. ఇల్లంతా పూలసోయగాలతో పరిమళిస్తోంది. లంగా ఓణీలు కట్టిన పడుచులతో మెరిసిపోతోంది. ముత్తయిదువులు పట్టుచీరలు కట్టుకుని చేసే హడావిడికి లెక్కే లేదు. మరో పక్క సంగీతం జోరుగా వినిపిస్తోంది. కుటుంబం, బంధువులు...ఇలా అందరూ కలిసి సరదాగా ఓ పాటేసుకుంటున్నారు. వాళ్లతో కలిసి మహేష్‌బాబు స్టెప్పులేస్తున్నాడు. ఎందుకంటే 'బ్రహ్మోత్సవం' కోసం.

మహేష్‌బాబు మాట్లాడుతూ ''శ్రీకాంత్‌ అడ్డాల చెప్పిన కథ బాగా నచ్చింది. 'శ్రీమంతుడు' తర్వాత ఇంత మంచి కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులతో పాటు నా అభిమానుల్ని అలరించే చక్కటి కుటుంబ కథా చిత్రమవుతుంద''న్నారు.

''సంగీత్‌ సాంగ్‌తో పెద్ద ఎత్తున చిత్రీకరణ మొదలుపెట్టాం. ఈ వేడుకలు ఇలానే కొనసాగుతాయి''అన్నారు దర్శకుడు.

నిర్మాతల్లో ఒకరైన ప్రసాద్‌ వి. పొట్లూరి మాట్లాడుతూ ''తిరుమల బ్రహ్మోత్సవాలు మొదలైన రోజునే మా చిత్రం ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. తోట తరణి వేసిన భారీ సెట్‌లో ఈ పాటను తెరకెక్కిస్తున్నాం. వేసవి కానుకగా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామ''న్నారు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు, కూర్పు: శ్రీకర ప్రసాద్‌, సంగీతం: మిక్కీ.జె. మేయర్‌

English summary
Intex brand ambassador Mahesh Babu loves to do everything in style. So when it comes to choosing his phone, he follows the trend, carries the trendiest phone in tinsel town leaving everyone amazed. You’ve gotta have some style like Surya. Have you got it yet?
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu