»   » మహేష్ బాబు...‘ఆనందం ఆనందం’

మహేష్ బాబు...‘ఆనందం ఆనందం’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాదఖ: మహేష్ బాబు, వెంకటేష్ మల్టీ స్టారర్ గా తెలుగులో తెరకెక్కిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం తమిళంలో విడుదలకు సిద్ధమైంది. అక్కడ ఈ చిత్రానికి ‘ఆనందం ఆనందం' అనే టైటిల్ ఖారు చేసారు. తమిళ వెర్షన్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా....వివిధ కారణాలతో లేటయింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సమంత, అంజలి హీరోయిన్లు.

ప్రస్తుతం మహేష్ బాబు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తూ బిజీగా గడుపుతున్నారు. టైటిల్ ఇంకా అపీషియల్ గా ఖరారుకాలేదు. ప్రస్తుతం ‘శ్రీమంతుడు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. షూటింగ్, పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి జులై 17న సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారట. ఈ చిత్రం బిజినెస్ ఓ రేంజిలో జరుగుతోందని సమాచారం. రీసెంట్ గా ఈ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని అమ్మారని అదీ రికార్డు రేటుకు అని చెప్తున్నారు. క్లాసిక్ ఎంటర్నైమెంట్ వారు..ఈ రైట్స్ ని 8.1 కోట్లకు సొంతం చేసుకున్నట్లు వినికిడి. ఇప్పటివరకూ ఏ తెలుగు సినిమాకు ఈ రేటు రాలేదు. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ ..అత్తారింటికి దారేది, మహేష్ సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాలే ఎక్కువ రేట్ తో నెంబర్ వన్ పొజీషన్ లో ఉన్నాయి. ఇప్పుడు తన రికార్డుని తనే మహేష్ బ్రద్దలు కొట్టుకున్నారు.

Mahesh Babu Movie is Aanandam Aanandam

ఈ చిత్రంలో మహేష్ బాబు మల్టీ మిలియనీర్(ధనవంతుడు)గా కనిపించబోతున్నాడు. ఇందులో అతని లుక్, స్టైల్ పూర్తిగా డిఫరెంటుగా కనిపించబోతున్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఉగాదికి ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన శృతి హాసన్ నటిస్తోంది. జగపతి బాబు మహేష్ బాబు తండ్రి పాత్ర పోషిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. కమర్షియల్ ఎంటర్టెనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నీ చిత్రానికి ‘శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్, ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

English summary
Mahesh Babu and Venkatesh's blockbuster hit Seethamma Vakitlo Sirimalle Chettu (SVSC) is gearing up to take Tamil Nadu by storm as Aanandam Aanandam.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu