»   » టాలీవుడ్ లో కొత్త ఆసక్తి ఇదే "మహేష్ బాబు కొత్త పేరేమిటి"? కొత్త సినిమాలో వింత కెమెరాలు దింపారు

టాలీవుడ్ లో కొత్త ఆసక్తి ఇదే "మహేష్ బాబు కొత్త పేరేమిటి"? కొత్త సినిమాలో వింత కెమెరాలు దింపారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

భారతదేశంలోని అత్యుత్తమ సినిమాటోగ్రాఫర్ లలో సంతోష్ శివన్ ఒకరు. దర్శకుడు మురుగదాస్ ఏరికోరి మరీ మహేష్ తో తాను తీయ బోయే సినిమా కోసం ఆయన్ను ఎంచుకున్నాడు. మహేష్ - మురుగదాస్ ల సినిమా అంటే మామూలుగానే ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు జనం. అంచనాలూ భారీ గానే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ఇద్దరికీ సంతోష్ శివన్ లాంటి ఇంకో టెక్నికల్ ధిగ్గజం కూడా తోడయ్యేసరికి ఈ కాంబినేషన్ అటు టెక్నికల్ గా కూడా మరిన్ని అంచనాల్ని పెంచుతోంది. అందుకు తగ్గట్టుగానే సినిమాని తీర్చిదిద్దుతున్నారు.

Mahesh Babu and Murugadoss Movie Title Agent Siva?

ప్రస్తుతం హైదరాబాద్ లో మహేష్ పై కార్ ఛేజింగ్ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. ఆ సీక్వెన్స్ కి ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ నేతృత్వం వహిస్తున్నారు. దక్షిణాది సినిమాల్లో ఇదివరకెప్పుడూ చూడని విధంగా ఈ సీక్వెన్స్ ఉండాలని మురుగదాస్ - సంతోష్ శివన్ ప్లాన్ చేశారట. ఆ మేరకు భారీ ఎక్విప్ మెంట్ తో సినిమాని తీస్తున్నారు. ప్రత్యేకమైన కెమెరాల్ని వాడుతున్నట్టు తెలిసింది. ఎత్తునుంచి సన్నివేశాల్ని తీయడానికి డ్రోన్ కెమెరాలని వాడుతుంటారు. మహేష్ సినిమాకోసం ఆక్టోపస్ ని పోలివుండే డ్రోన్ ని వాడుతూ దానికి ఓ కొత్త రకమైన కెమెరాని అతికించినట్టు తెలిసింది. ఒకేసారి రెండు మూడు కెమెరాలతో ఈ సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

మొన్నటివరకూ ఈ ఇద్దరి క్రేజీ కాంబో కి టైటిల్ విషయం లో ఇంకా క్లారిటీ రాలేదు కానీ ఏజెంట్ శివ అనుకుంటున్నారట. ఐతే ఏజెంట్ శివ అనే టైటిల్ మహేష్-మురుగ దాస్ కాంబినేషన్‌ స్థాయికి తగ్గ రేంజిలో లేదన్నది వాస్తవం. మరీ సూపర్ స్టార్ కృష్ణ కాలం లో వచ్చిన సినిమాలూ, అదే కాలం నాటి డిటెక్టివ్ నవల పేరులాగా అనిపిస్తుందన్న టాక్ వినిపిస్తోంది. అభిమన్యుడు, ఎనిమీ లాంటి టటిళ్లని పరిశీలిస్తున్నట్టు వార్తలు వచ్చినా అవి నిజం కాదని తేలిపోయింది. అభిమన్యుడు టైటిల్ కైతే అభిమానులనుంచే వ్యతిరేకత మొదలయ్యిది.

Mahesh Babu

మరి ఈ టైటిల్ అఫీషియలేనా కాదా అన్నది చూడాలి. ఊరికే ఈ టైటిల్ లీక్ చేసి రెస్పాన్స్ ఎలా ఉంటుందో కూడా అంచనా వేస్తున్నారేమో తెలియదు. ఐతే ఈ సినిమాకు టైటిల్ ఏదైనా.. ద్విభాషా చిత్రం కాబట్టి రెంటికీ ఒకటే టైటిల్ ఉండేలా చూసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 50 శాతానికి పైగా పూర్తయింది. రెగ్యులర్ షూటింగ్ మొదలైనప్పటి నుంచి నిర్విరామంగా పని చేస్తున్నారు మురుగ, మహేష్. వచ్చే ఏడాది ఏప్రిల్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది. దాదాపు రూ.90 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది.

English summary
Mahesh Babu and Murugadoss New Movie Several titles were gossiped in the media, which include ‘Enemy’, ‘Vasco De Gama’ and very recently ‘Abhimanyudu’. However, the film unit condemned all of them as gossips and they are not considering any of them as the titles. However, another title is now being heard for the movie. It is ‘Agent Shiva’. It is rumoured that the title is almost confirmed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu