»   » రిలీజ్ డేట్ అప్పుడా? మహేష్ బాబు రిస్క్ తీసుకుంటున్నాడా..??

రిలీజ్ డేట్ అప్పుడా? మహేష్ బాబు రిస్క్ తీసుకుంటున్నాడా..??

Posted By:
Subscribe to Filmibeat Telugu

  టాలీవుడ్ లో కథ ని కూడా కొన్ని సార్లు స్టార్ హీరో చరిష్మా డామినేట్ చేస్తుంది. కేవలం హీరో భుజాల పైనే సినిమా గట్టెక్కిన సంధర్బాలూ లేక పోలేదు. అయితే అన్ని సంధర్భాల్లఒనూ సాధ్యం కాకపోవచ్చు. ఇక మిగతా సినిమాలనుంచి ఉండే పోటీ ఎలాగూ ఉండేదే.ఇప్పుడిదంతా ఎందుకూ అంటే. మహేష్ బాబూ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రాన్ని 2017 ఏప్రిల్ 28న విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ తేదీ కి ఒక ప్రత్యేకత ఉంది మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ పోకిరి కూడా పదేళ్ల కిందట ఏప్రిల్ 28నే విడుదలై ప్రకంపనలు రేపింది.

  ఆ సెంటిమెంటును దృష్టిలో ఉంచుకుని మహేష్-మురుగ సినిమాను కూడా అదే రోజు విడుదల చేయాలనుకుంటున్నారన్నది ఈ వార్త సారాంశం.ఈ చిత్ర యూనిట్ వర్గాలు కూడా ఇదే మాట అన్నాయి. అయితే ఈ సెంటి మెంట్ సంగతి పక్కన పెడితే వచ్చే ఏడాది ఈ సెంటిమెంట్ ని డామినేట్ చేసే విషయం ఇంకొకటుంది.

  వచ్చే ఏడాది ఏప్రిల్ 28న ఇంకో సినిమా రిలీజ్ కూడా ఉంది కేవలం టాలీవుడ్ కి మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అన్ని "వుడ్" లూ ఆ రోజునే కాదు అసలు ఆ సీజన్ లోనే తమ సినిమా రిలీజ్ చేయటానికి ఆలోచించే రోజది... ఇంతకీ ఆ సినిమా ఏదంటే బాహుబలి: ది కంక్లూజన్. ముందు ఏప్రిల్ 17కు అనుకున్న ఈ సినిమా.. ఆ తర్వాత ఏప్రిల్ 28వ తేదీని ఫిక్స్ చేసుకుంది. ఈ సారి ఖచ్చితంగా అనుకున్న తేదీనే థియేటర్లలో బాహుబలి అడుగుపెట్టనున్నాడు వాయిదా పడకుండా ఉండాలన్న సంకల్పం తోనే పనిచేస్తున్నాడు రాజమౌళి.

  Mahesh Babu new Movie going to clash with Baahubali 2

  ఎందుకంటే ఈ సినిమా ఇప్పుడు కేవలం తెలుగు సినిమా కాదు నేషనల్ ఇండస్ట్రీలన్నీ ఏదో ఒక రకంగా ఈ సినిమాతో ముడిపడే ఉన్నాయి. బాలీవుడ్లో పెద్ద సినిమాలకు సంబంధించి ఒకసారి రిలీజ్ డేట్ ప్రకటించాక మళ్లీ మారిస్తే చాలా ఇబ్బందువుతుంది. 'బాహుబలి: ది బిగినింగ్' విషయంలో ఇలాగే మార్చడంతో కరణ్ జోహార్ చాలా సీరియస్ అయ్యాడు. కాబట్టి ఈ సారి అసలు వాయిదా అన్న మాట వినిపించకూడదు అనుకుంటున్నాడట రాజమౌళి. కాబట్టి మహేష్ సెంటిమెంటు ని కాస్త పక్కన పెట్టి ఆలోచించటం మంచిదేమో అని అంటున్నారు సినీ విశ్లేషకులు.

  'శ్రీమంతుడు' సినిమాను 'బాహుబలి: ది బిగినింగ్' కోసం వాయిదా వేసుకున్నా ఆ సినిమా హైప్ ని దాటుకొని బంపర్ హిట్ కొట్ట గలిగాడు. నిజానికి ఆ టైంలో బాహుబలిలాంటి సినిమాను దాటి ఆ స్థాయి హిట్ అంటే 80% మహేష్ చరిష్మానే. కానీ ఈ సారి అది కుదరక పోవచ్చు ఎందుకంటే బాహుబలి కోసం ఎంత ఆసక్తిగా ఉన్నారో అంతకంటే రెండింతలు ఇప్పుడు ఆసక్తితో ఉన్నారు జనం. ఒక వేళ బాహుబలి గానీ ఆ అంచనాలను అందుకుందీ అంటే ఇక ఆసమయం లో వచ్చే సినిమాలన్నీ గాలికి కొట్టుకు పోయినట్టే. మహేష్ స్టామినా ఎంత ఉన్నా ఇప్పుడున్న పరిస్థితి లో ఆ డేట్ ని కాస్త పక్కన పెట్టటమే మంచిదేమో అనుకుంటున్నారు మహేష్ అభిమానులు కూడా మరి మహేష్ ఏం ఆలో చిస్తున్నాడో...

  English summary
  latest buzz is that the makers have started planning about the film's release and it is reported that the flick is likely to be released on April 28.It means the Mahesh Babu-starrer is heading for a clash with Baahubali 2.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more