»   »  వైరల్ వీడియో: భరత్ బహిరంగ సభలో ఇది గమనించారా.. మహేష్, ఎన్టీఆర్ సేమ్ టూ సేమ్!

వైరల్ వీడియో: భరత్ బహిరంగ సభలో ఇది గమనించారా.. మహేష్, ఎన్టీఆర్ సేమ్ టూ సేమ్!

Subscribe to Filmibeat Telugu
భరత్ బహిరంగ సభలో ఇది గమనించారా.. మహేష్, ఎన్టీఆర్ సేమ్ టూ సేమ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ఏప్రిల్ 20 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రం మహేష్, కొరటాల సూపర్ హిట్ కాంబోలో తెరకెక్కుతుండడంతో బ్లాక్ బాస్టర్ హిట్ ఖాయం అనే ధీమాతో అభిమానులు ఉన్నారు. ఇటీవల జరిగిన భరత్ బహిరంగ సభ, ట్రైలర్ విడుదుల తరువాత చిత్రంపై అంచనాలు రెట్టింపైపోయాయి. ఈ ఈవెంట్ కు యూన్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. దీనితో భరత్ అనే నేను చిత్రంతో అభిమానుల ఫోకస్ మరింతగా ఎక్కువైంది. భరత్ భహిరంగ సభ ఈవెంట్ లో మహేష్, ఎన్టీఆర్ లాంగ్వేజ్, నిలబడిన స్టైల్ కి సంబందించిన ఓ వీడియో ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తోంది.

మహేష్ బాబు ముఖ్యమంత్రిగా

మహేష్ బాబు ముఖ్యమంత్రిగా

మహేష్ బాబు తొలిసారి ముఖ్యమంత్రిగా, రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్న చిత్రం ఇదే. కొరటాల శివ ఈ చిత్రంలో మెహెష్ బాబుని సూపర్ స్టైలిష్ గా చూపించబోతున్నారు.

బ్లాక్ బాస్టర్ కాంబినేషన్

బ్లాక్ బాస్టర్ కాంబినేషన్

మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో గతంలో శ్రీమంతుడు వంటి రికార్డులు తిరగరాసిన చిత్రం వచ్చింది. భరత్ అనే నేను చిత్రం పై కూడా అంతకు మించి అంచనాలు ఉన్నాయి.

రాజకీయ నేపథ్యంలో

రాజకీయ నేపథ్యంలో

కొరటాల శివ తన ప్రతి చిత్రంలో ఎదో ఒక సామజిక అంశాన్ని అంతర్లీనంగా చెబుతూనే కమర్షియల్ అంశాలని దట్టిస్తారు. శ్రీమంతుడు చిత్రంలో పుట్టిన ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్, జనతా గ్యారేజ్ చిత్రంలో పర్యావరణాన్ని రక్షించే అంశాలని చూపించాడు. భరత్ అనే నేను చిత్రంతో ఇచ్చిన మాట నిలబెట్టుకునే రాజకీయ నాయకుడిగా మహేష్ బాబుని చూపించబోతున్నాడు.

ట్రైలర్ కు అద్భుత రెస్పాన్స్

ట్రైలర్ కు అద్భుత రెస్పాన్స్

భరత్ అనే నేను చిత్ర ట్రైలర్ కు అద్భుత రెస్పాన్స్ వస్తోంది. మహేష్ బాబు లుక్స్ అదిరిపోయే విధంగా ఉన్నాయి. ప్రతి ప్రేములో మహేష్ బాబు స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఈ చిత్రం ఉత్కంఠ రేకెత్తించే పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోంది.

కైరా తొలి చిత్రం

కైరా తొలి చిత్రం

బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ తెలుగులో నటిస్తున్న తొలి చిత్రం ఇదే. తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ సరసన నటించే ఛాన్స్ రావడం కైరా అదృష్టం అని చెప్పొచ్చు.

భహిరంగ సభలో ఇది గమనించారా

భరత్ బహిరంగ సభకు ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఎన్టీఆర్, మహేష్ బాబు కలయిక అభిమానులని విపరీతంగా అలరించింది. భరత్ భహిరంగ సభలో ఎన్టీఆర్, మహేష్ కు సంబందించిన ఓ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహేష్ బాబు, ఎన్టీఆర్ ఒకేసారి చేతులు కట్టుకోవడం, అటు ఇటు ఊగడం వంటి దృశ్యాలు ఒకేసారి జరిగాయి. ఈ వీడియో అభిమానులని ఆకట్టుకుంటోంది.

English summary
Mahesh Babu and NTR video goes viral in social media. Perfect movement by Mahesh and NTR at a time
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X