For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  'శ్రీమంతుడు' సెట్స్ పై మహేష్ బాబు(ఫొటో)

  By Srikanya
  |

  హైదరాబాద్ :మహేష్‌బాబు హీరోగా మైత్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ హీరోయిన్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పొల్లాచ్చిలో చిత్రీకరణ సాగుతోంది. అక్కడ ఓ పోరాట ఘట్టాన్ని తెరకెక్కిస్తున్నారు. ఫైట్‌ మాస్టర్‌ అనల్‌ అరసు నేతృత్వం వహిస్తున్నారు. అక్కడ లొకేషన్ లో తీసిన ఫొటో ఇది. మీరూ ఓ లుక్కేయండి.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  శనివారం నుంచి పళనిలో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తారు. మార్చి 3న చిత్రబృందం హైదరాబాద్‌ వస్తుంది. ఆ తరువాత నుంచి నగరంలోనే షూటింగ్‌ కొనసాగిస్తారు. ఈ చిత్రానికి 'శ్రీమంతుడు' అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. మేలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు.

  ఓవర్ సీస్ లో లీడింగ్ డిస్ట్రిబ్యూటర్స్ సౌత్ ఇండియన్ క్లాసిక్ ఎంటర్టైన్మెంట్ వారు మహేష్ బాబు,కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్నారు. మే 2015 లో ఈ చిత్రం రిలీజ్ అవుతుంది. ఓవర్ సీస్ లోనూ భారీగ ఈ చిత్రం విడుదల కానుంది.

  ప్రస్తుతం పొల్చాచ్చి లో జరుగుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఉగాది రోజు అంటే మార్చి 21 న విడుదల చేయటానికి నిర్ణయించినట్లు సమాచారం. అలాగే ఈ చిత్రానికి ‘జమిందార్' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం.

   Mahesh Babu on the sets of Srimanthudu!

  ప్రస్తుతం జరుగుతున్న పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి కాగానే ఈ చిత్ర టీం పన్నెండు రోజుల షెడ్యూల్ కోసం ఫ్రాన్స్ కు వెళ్లనున్నారు. ఈ సినిమాకు బాలీవుడ్ స్టంట్ మాస్టర్ యాక్షన్ అణల్ అరసు యాక్షన్ కంపోజర్ గా పనిచేస్తున్నాడు.

  మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, బ్రహ్మానందం, పూర్ణ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

  తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ‘శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంతో దర్శకుడు కొరటాల శివ తేల్చాల్సి ఉంది. ఈ విషయం విన్న ఫ్యాన్స్ ఈ టైటిల్ మహేష్ బాబు ఇమేజ్ కు తగిన విధంగా లేదని అంటున్నారు. ఈ టైటిల్ విషయమై కొరటాల శివ త్వరలోనే సోషల్ నెట్వర్కింగులో స్పందించే అవకాశం ఉంది.

  మహేష్ తో ప్రాజెక్టు మొదలైన నాటి నుంచి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉండటం...వెంటనే దర్సకుడు కొరటాల శివ ఖండించటం కామన్ అయ్యిపోయింది. కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్‌ శైలికి తగ్గట్టుగా మాస్‌ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.

  ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, సుకన్య, అలీ, వెన్నెల కిషోర్‌, సితార, తులసి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

  English summary
  Have a look at Mahesh Babu in the on location picture of his upcoming flick 'Srimanthudu'.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X