»   » నా డ్రీమ్ రాజమౌళి ద్వారా నెరవేరింది: మహేష్ బాబు

నా డ్రీమ్ రాజమౌళి ద్వారా నెరవేరింది: మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అనే టీవీ ఇంటర్వ్యూలో మహేష్ బాబు పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. నాన్న దగ్గర చాలా మంచి తనం ఉందని, అంత మంచి తనం తాను వద్దనుకుంటున్నానని తెలిపారు. రాజమౌళి వద్వారా తన డ్రీమ్ నెరవేరినట్లు తెలిపారు.

సినిమా ఒత్తిడులు ఇంటికి తీసుకురాకూడదనేది నాన్న నుంచి నేర్చుక్నుదే. ఆయనకు విపరీతమైన మంచితనం ఉంది. ‘నో' చెప్పటం తెలీదు. ఆ ప్రాసెస్‌లో రాంగ్‌ సినిమాలు చేశారు. నా పదహారేళ్ల వయసులో గమనించినవన్నీ మైండ్‌లో ఉండిపోయాయి. ఆయన్ని చూసి మంచి, చెడు నేర్చుకున్నాను. కానీ అంత మంచితనం వద్దనుకున్నాను అని మహేష్ బాబు చెప్పుకొచ్చారు.


శ్రీమంతుడు సినిమా గురించి మాట్లాడుతూ... సినిమా చేసేటపుడు పవర్‌ఫుల్‌ పాయింట్‌ అని తెలుసు. అయితే ఈ సినిమా వల్ల ఇంత ఇంపాక్ట్‌ ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ సినిమాతో నాకు సోషల్‌ రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఓ క్యారెక్టర్‌తో ఏడునెలలు ట్రావెల్‌ అయితే ఎంతో కొంత మారతాం. ‘ఈ సినిమా ప్రభావంతో కొందరు యంగ్‌స్టర్స్‌ గ్రామాల్ని దత్తత తీసుకుంటున్నాం' అంటుంటే ఎంతో తృప్తిగా అనిపించింది అన్నారు.


Mahesh Babu Open Heart with RK

ఇతర హీరోల సినిమాలకు వాయిస్ ఓవర్ ఇవ్వడంపై స్పందిస్తూ...మహేష్‌: అవును. వేరే హీరోలకు వాయిస్‌ ఇస్తే తప్పేంటి అనేది నా ఫీలింగ్‌. దర్శకులు త్రివిక్రమ్‌, శ్రీనువైట్ల నా ఫ్రెండ్స్‌. వారి సినిమాలకోసం అడిగినపుడు అంగీకరించాను. మల్టీస్టారర్‌ కథలకూ ముందుంటాను. వాటిలో నటిస్తే ప్రేక్షకులకూ కొత్తగా ఉంటుంది. అందుకే ఇలాంటివి ఎంకరేజ్‌ చేస్తాను. ఎందుకంటే ఇండస్ట్రీ ఇంతకు ముందులా లేదు. ఎవరి ప్లేస్‌ వారికి ఉంది. ట్విట్టర్‌ ఇంటరాక్షన్‌లో ఎవరో అడిగితే ‘పవన్‌ కళ్యాణ్‌ గారితో నటిస్తా' అన్నాను. దాన్నే అందరూ రాస్తున్నారు అన్నారు.


హిందీ సినిమాలకు దూరంగా ఉండటంపై స్పందిస్తూ....తెలుగులోనే మంచి సినిమాలు చేయాలి. గొప్ప సినిమాలు చేయాలి. అవి చూసి వేరే వాళ్లు చెప్పుకోవాలి. అలాంటి స్థాయికి వెళ్లటానికి మనకు స్కోప్‌ ఉంది. నా డ్రీమ్‌ రాజమౌళి బాహుబలి ద్వారా నెరవేరింది. మన ఇండస్ట్రీలోనే ఇంప్రూవ్‌ కావాలని ఉంది. ఇది వదిలేసి హిందీలో చేసేద్దాం అనే కోరిక నాకు లేదు అన్నారు.


గౌతం గురించి... గౌతమ్‌ స్కూల్‌కు వెళ్లకుండా ఎగ్గొట్టేందుకు నా నెక్ట్స్‌ సినిమాలో యాక్ట్‌ చేస్తాను అంటుంటాడు. ‘శ్రీమంతుడు' చిత్రం చూశాక రియలిస్టిక్‌ ఫిల్మ్‌ అంటూ పెద్ద మాటలు మాట్లాడేస్తున్నాడు. ఇంతకుముందు చేసిన వాటికంటే ‘శ్రీమంతుడు' కొత్తగా ఉందంటూ ఈ సినిమాను మూడుసార్లు చూశాడు. గౌతమ్‌ మాటలు వింటుంటే నాకే కొత్తగా ఉంటుంది. గౌతమ్‌కు యాక్షన్‌ నచ్చదు. ‘వన్‌' లో ఫైటింగ్‌ ఎక్కువని చూడలేదు. ‘సీతమ్మ వాకిట్లో..' తర్వాత ‘శ్రీమంతుడు' చూశాడు అన్నారు.


Mahesh Babu Open Heart with RK

రాజమౌళితో సినిమా గురించి...‘బాహుబలి' తెలుగు సినిమా అయినందుకు గర్వంగా ఫీల్‌ అవ్వాలి. నా కెరీర్‌లో అలాంటి సినిమా చూస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ప్యాషన్‌తో సినిమా చేస్తే గొప్ప మార్కెట్‌ ఉంటుందని ప్రూవ్‌ చేశారు. రాజమౌళితో కలిసి పనిచేయాలని నాలుగేళ్ల క్రితమే అనుకున్నా. రాజమౌళి దర్శకత్వంలో సినిమా ఓకే అయ్యింది. దానికి కె.ఎల్‌. నారాయణ ప్రొడ్యూసర్‌ అని తెలిపారు.


ప్రతీ సినిమా చూశాక ఇంకా బాగా చేయాలనిపిస్తుంది. నటులకి అలా అనిపించడం మంచి లక్షణం. నాకు 90 ఏళ్లు వచ్చాక కూడా నటించాలనేదే నా యాంబిషన్ అన్నారు.


అందం, ఫిజిక్‌ మెయింటెనెన్స్‌ సీక్రెట్‌ ఏంటి ? అనే ప్రశ్నకు స్పందిస్తూ.. అదేంటో నాకూ తెలీదు. హెల్దీ లైఫ్‌స్టైల్‌. నాన్నగారిలాగే నాకూ ఓ అలవాటు ఉంది. ఎప్పుడూ నవ్వుతుంటాను. షూటింగ్‌ టైంలో కార్బోహైడ్రేట్‌ మీల్స్‌ రోజుకు ఆరేడుసార్లు తక్కువ మోతాదులో మూడుగంటలకోసారి తీసుకుంటాను. అయితే ఎక్సర్‌సైజ్‌లాగా డైట్‌ మెజర్డ్‌గా ఉంటుంది. నాకు ఫుడ్‌ అంటే చాలా ఇష్టం. త్వరగా బరువు పెరిగే శరీరం గుణం నాది. హాలిడేస్‌ టైంలో రెండు మూడు కేజీలు పెరుగుతుంటా. వెంటనే డైట్‌ పాటించి కొవ్వును కరిగించేస్తుంటా. ఈ పదిహేనేళ్లలో ఇపుడున్నంత ఫిట్‌గా నేను ఎప్పుడూ లేను అన్నారు.


మిమ్మల్ని ఎవరైనా ఎత్తుకుపోతారని మీ ఆవిడ జెలసీగా ఫీల్‌ కాలేదా? అనే ప్రవ్నకు స్పందిస్తూ... అస్సలు లేదు. ఏ రోజూ అలాంటి డిష్కన్‌ రాలేదు. నేనేంటో తనకు తెలుసు.. అందుకే ఇలాంటి సిల్లీ డౌట్స్‌ తనకు రావు. మన బిహేవియర్‌ను బట్టే ఇతరులుంటారు. నేను ప్యూర్‌ హార్డ్‌వర్క్‌, డెడికేషన్‌తో సెట్స్‌లో ఉంటాను. ముందునుంచీ నేను ఇలాగే ఉన్నాను. సినిమాలో పనిచేయటం చాలా కష్టం అని ఫీలింగ్‌. అక్కడ కష్టపడి ఇంటికొస్తే ఆనందంగా ఉండాలి అన్నారు.


‘అల్లూరి సీతారామరాజు' గురించి మాట్లాడుతూ...ఆ సినిమా నా ఫేవరేట్‌ చిత్రం. 50 సార్లు చూశాను. అంత గొప్ప సినిమాను రీమేక్‌ చేసి చెడగొట్టే ఇష్టం లేదు. క్లాసిక్‌ క్లాసిక్‌గానే ఉండాలి. అలాంటివన్నీ మనం అనుకుంటే జరగవు. కొన్ని జరుగుతాయంతే. మా నాన్న అలాంటి గొప్ప ప్రాజెక్ట్‌ చేసినందుకు చాలా గర్వంగా ఉంది అన్నారు.

English summary
In Open Heart With RK, Watch Prince Mahesh Babu saying about his Life, Career, Family, Movies, and so many things about him.
Please Wait while comments are loading...