»   » మహేష్, పవన్ ఫ్యాన్స్ వార్: ఫ్లెక్సీల కోసం రక్తం కళ్ళ చూసుకున్నారు

మహేష్, పవన్ ఫ్యాన్స్ వార్: ఫ్లెక్సీల కోసం రక్తం కళ్ళ చూసుకున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒక హీరో పై ఉన్న అభిమానం సాటి మనుషుల మీద ద్వేషంగా మారకూడదు. అభిమానం ఉన్నంత వరకూ బాగానే ఉంటుంది కానీ అదే దురభిమానం అయితే మనిషి ని ఎంతకైనా దిగజారుస్తుంది. ఆ ఒక్క అభిమనినేనా. అతడు ఎవరి కోసమైతే అంతకు తెగబడ్డాడో ఆ హీరోకి కూడా చెడ్డ పేరే కదా. కొన్ని నేలల క్రితం ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఇద్దరు స్టార్ హీరోల అభిమానులు పరస్పరం గొడవపడి. ఒక హీరో అభిఒమానిని పొడిచి చంపిన విషయం ఇంకా మరచిపోనే లేదు, భీమవరం లో ప్రభాస్, పవన్ ఫ్యాన్స్ గొడవ చిన్న స్థాయి యుద్దం రేంజి లో జరిగిన విషయమూ ఇంకా మరుగున పడలేదు...

Mahesh Babu, Pawan Kalyan fans attack each other

తాజాగా అలాంటి రచ్చే తూర్పుగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని ముమ్మిడివరం మండలంలోని అనాతవరంలో నిర్వహించిన గణేష్ నిమజ్జనం సందర్భంగా చేపట్టిన ఊరేగింపు పెను ఘర్షణకు తావిచ్చింది. ఊరేగింపులో భాగంగా మహేశ్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తారా జువ్వలు.. టపాసుల్ని కాల్చారు. ఈ సందర్భంగా పవన్ ఫ్యాన్స్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ధ్వంసమైంది. దీంతో వారు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. కావాలనే తమ అభిమాన హీరో ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని ఫీల్ కావటంతో వాతావరణం రచ్చ రచ్చగా మారింది.

Mahesh Babu, Pawan Kalyan fans attack each other

ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం ముదిరి రాళ్లు రువ్వుకోవటం.. సోడా సీసాలు విసురుకోవటం వెళ్లింది. దీంతో.. రెండు వర్గాలకు చెందిన పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. పరస్పర దాడులతో వాతావరణం ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకోవటమే కాదు.. రక్తం చిందేలా చేసింది. చివరకు గ్రామస్తులు కలుగజేసుకొని ఇరు వర్గాల ఫ్యాన్స్ ను శాంతింపచేశారు. అయితే.. ఈ గొడవల కారణంగా ఆరుగురికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.

English summary
A big fight was started because of posters of Superstar and Powerstar which created a huge controversy in Nathavaram village. The fans of both Pawan and Mahesh had a clash in a village in East Godavari during Ganesh immersion ceremony.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu