»   » దేశభక్తి ప్రాజెక్టులో మహేష్ బాబు

దేశభక్తి ప్రాజెక్టులో మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

మహేష్ బాబు కి మరో అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ప్రసారం కానున్న 'ఫిర్ మిలే సుర్..గా' గీతంలో ఆంధ్రప్రదేశ్ తరుపున మహేష్ ని సెలక్ట్ చేసారు. మహేష్ కూడా ఈ దేశభక్తి కి చెందిన ప్రాజెక్టును సంతోషంగా ఒప్పుకున్నాడు. దాదాపు ఇరవై సంవత్సరాల క్రిందట దేశవ్యాప్తంగా దూరదర్శన్ లో ప్రసారం అయి ప్రజలను ఉత్సాహపరిచిన బహుభాషా జాతీయ సమైక్య గీతం 'మిలే సుర్ మేరా తుమ్హారా' కి తాజా వెర్షన్ 'ఫిర్ మిలే సుర్..గా' .ఇక కొత్తగా చిత్రీకరణ జరుపుకొన్న ఈ గీతానికి పి.వైద్యనాథన్ తో పాటు సహ స్వరకర్తగా ఉన్న లూయీ బాంక్స్ స్వరకల్పన చేశారు. కైలాస్ సురేంద్రనాథ్ ఈ గీత చిత్రీకరణకు దర్శకత్వం హించారు.

తెలుగులో మహేష్ తో పాటు బ్యాండ్ మింటన్ క్రీడాకారులు గోపీచంద్, సైనా నెహ్వాల్ కూడా కనిపిస్తారు. అలాగే ఈ గీతంలో వివిధ భాషా చిత్రాలకు చెందిన ప్రముఖులు కనిపిస్తారు. ఈ గీతంలో కనిపించే ఇతర భాషా చిత్రాల ప్రముఖులలో అమితాబ్, షారూక్, సల్మాన్, ఐశ్వర్య, ఎఆర్ రెహమాన్, శంకర్-ఎహసాన్-లాయ్, కెజె ఏసుదాస్, ప్రియాంక చోప్రా, దీపికా పదుకునే, అనౌష్కా శర్మ, సోను నిగమ్, రణ్ బీర్ కపూర్, షాహిద్ కపూర్, శిల్పా శెట్టి, శ్రేయా ఘోషల్ తదితరులు ఉన్నారు. ఈ గీతాన్ని బెనెట్, కోలమన్ సంస్థకు చెందిన 'జూమ్' ఛానల్ సమర్పిస్తోంది. మొత్తానికి మహేష్ సినిమాల ద్వారా కాకుండా మరోసారి అభిమానులకు కనువిందు చేయనున్నాడు..అదీ మంచి సందేశంతో కావటం మరో విశేషం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu