పిల్లలతో ఆటలాడుతూ మహేష్ బాబు (ఫోటో)
హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు... తన వృత్తి పరంగా ఎంత ప్రొఫెషనల్‌గా ఉంటారో, ఫ్యామిలీకి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఆయన ఉంటే సినిమా లేదా యాడ్ షూటింగులో, లేదా ఇంట్లోనే ఉంటారు. ఇటీవలే ‘శ్రీమంతుడు' షూటింగ్ పూర్తి చేసుకున్న మహేష్ బాబు ఆ వెంటనే తన ఫ్యామిలీతో కలిసి స్విట్జర్లాండ్‌కు వెకేషన్ వెళ్లారు.

తాజాగా ఆయన స్విట్జర్లాండ్‌లో తన పిల్లలతో కలిసి ఆటాలాడిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. మహేష్ బాబుకు కుటుంబం అన్నా, తన పిల్లలన్నా ప్రాణం. ఇండియాలో వారిని ఎటైనా జాలీగా గడిపేందుకు బటయకు తీసుకెళ్లడం చాలా కష్టం. ఎందుకంటే ఎక్కడికెళ్లినా అభిమానులు చుట్టుముట్టేస్తారు.
అందుకే ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండే మహేష్ బాబు ఏ చిన్న సమయం చిక్కినా వెంటనే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు చెక్కేస్తాడు. అక్కడ భార్య పిల్లలతో కలిసి ఎంజాయ్ చేసి వస్తారు.


Click it and Unblock the Notifications











