»   » వరుణ్ తేజ్ ‘కంచె’ ట్రైలర్‌పై మహేష్ బాబు కామెంట్

వరుణ్ తేజ్ ‘కంచె’ ట్రైలర్‌పై మహేష్ బాబు కామెంట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కంచె'. ఇటీవలే ఈచిత్రం ట్రైలర్ విడుదలైంది. ఆకట్టుకునే విజువల్స్ తో ఈ టీజర్ ఆకట్టుకునే విధంగా ఉంది. అందరిలోనూ సినిమాపై అంచనాలు పెంచేలా చేసింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ ట్రైలర్ పై స్పందించారు.

Mahesh Babu praises 'Kanche' trailer

‘కంచె ట్రైలర్ స్టన్నింగ్ గా ఉంది. ఎంటైర్ టీంకు ఆల్ ది బెస్ట్' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేసారు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో కూడా ‘కంచె' టీజర్ ను చూసి మెచ్చుకోవడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మహేష్ బాబు కామెంట్స్ వల్ల ఆయన అభిమానులు కూడా ‘కంచె' సినిమా చూడటానికి ఆసక్తి చూపుతారనడంలో సందేహం లేదు.


ఇప్పటి వరకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో ఎవరూ చిత్రీకరించని రెండవ ప్రపంచ యుద్ధ పోరాట సన్నివేశాలు ‘కంచె' చిత్రానికి స్పెషల్ హైలైట్ గా నిలుస్తాయి. జార్జియా దేశం లో, రియల్ వరల్డ్ వార్ 2 వెపన్స్ , యుద్ధ ట్యాంక్స్ , యూనిఫాం, లొకేషన్స్‌ను వాడుకుని, భారీ వ్యయం తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

బాలీవుడ్ లో ఇటివలే ‘గబ్బర్' చిత్రం తో మంచి విజయాన్ని సాధించిన అభిరుచి గల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం లో రూపొందుతోన్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది. భారీ వ్యవయంతో, అత్యుత్తమ సాంకేతిక విలువల తో రూపుదిద్దుకుంటున్నఈ చిత్రాన్ని రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు . ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ చిరంతాన్ భట్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు.

English summary
Mahesh Babu took to his microblogging page and wrote : "The trailer of Kanche is stunning . All the best to the entire team ..". It is a very good sign to the industry that some big heroes are praising others.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu