»   » ‘హీల్-ఎ-చైల్డ్’ ఫౌండేషన్ కోసం....మహేష్ బాబు

‘హీల్-ఎ-చైల్డ్’ ఫౌండేషన్ కోసం....మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం కొర్పొరేట్ బ్రాండ్లకు మాత్రమే కాదు....సమాజానికి సేవ చేస్తున్న పలు స్వచ్ఛంద సంస్థలకు ప్రచారం చేస్తూ తనలోని సేవా భావాన్ని చాటుతున్నాడు. గతంలో మహేష్ బాబు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నిరోదించడానికి చేపట్టిన 'MARD' ప్రచార కార్యక్రమంలో పాలు పంచుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా మహేష్ బాబు 'హీల్-ఎ-చైల్డ్' అనే స్వచ్చంద సంస్థకు గుడ్ విల్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోను ఇక్కడ చూడొచ్చు. ఆ సంస్థకు సంబంధించిన టీషర్ట ధరించి మహేష్ బాబు ఈ సంస్థను ప్రమోట్ చేస్తున్నారు. ఈ సంస్థ చిన్నారుల క్షేమం కోసం పని చేస్తుంది.

'హీల్-ఎ-చైల్డ్' సంస్థను ప్రమోట్ చేయడంపై మహేష్ బాబు ఆనందం వ్యక్తం చేసారు. నాలుగేళ్లుగా ఈ సంస్థ చిన్నారుల ఆరోగ్యం గురించి ఎంతో సీరియస్‌గా పని చేస్తుందని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. అనారోగ్యం పాలైన పేద చిన్నారులకు చికిత్స అందించడంలో ఈ సంస్థ ఆర్థిక సహాయం చేస్తుంది.

మహేష్ బాబు భార్య నమత్ర ఇటీవల ఈ సంస్థ కార్యాలయాన్ని సందర్శించి పనితీరును పరిశీలించారు. సంస్థ చేయబోయే కార్యక్రమాల గురించి ఆరా తీసారు. ఇలాంటి ఒక మంచి సంస్థకు ప్రతిఒక్కరూ మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉందని నమ్రత చెప్పుకొచ్చారు.

English summary
'Heal A Child' foundation has roped in Mahesh Babu as their Goodwill Ambassador and the actor has released posters promoting the cause of saving children.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu