»   » ఇదీ దాసరి నారాయణ రావు సత్తా: మహేష్ బాబు-జూఎన్టీఆర్ దిగ్భ్రాంతి

ఇదీ దాసరి నారాయణ రావు సత్తా: మహేష్ బాబు-జూఎన్టీఆర్ దిగ్భ్రాంతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ దర్శకులు, కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు మృతి తనను షాక్‌కు గురి చేసిందని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. దాసరి మృతిపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాసరి మృతి తీరని బాధ కలిగించిందని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

మహేష్ బాబు సంతాపం

మహేష్ బాబు సంతాపం

చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఆయ‌న లేని లోటు ఎప్ప‌టికీ, ఎవ్వ‌రూ భ‌ర్తీ చేయ‌లేర‌ని మహేష్ బాబు అన్నాడు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్న‌ట్లు పేర్కొన్నాడు. దాసరి మృతి ప‌ట్ల తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ఆయ‌నతో త‌మకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

జూ.ఎన్టీఆర్ సంతాపం

జూ.ఎన్టీఆర్ సంతాపం

దాసరి మృతి పట్ల సినీన‌టులు చిరంజీవి, బాల‌కృష్ణ‌, ఎన్టీఆర్ సంతాపం తెలిపారు. ప్రస్తుతం చైనాలో ఉన్న చిరంజీవి అక్కడి నుంచే సంతాప ప్రకటనను విడుదల చేస్తూ... ఇటీవ‌లే దాసరికి తాము అల్లు రామలింగయ్య అవార్డును అందించామ‌ని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో తాను దాసరితో చాలాసేపు మాట్లాడానని తెలిపారు.

తెలుగు సినిమాకు దాస‌రి కొత్త‌దారి చూపించార‌ని బాల‌కృష్ణ అన్నారు. కళామతల్లి ముద్దుబిడ్డ దాసరిని చిత్ర పరిశ్రమ ఎప్పటికీ మరువదని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నాడు.

రజనీకాంత్, కమల్ హాసన్ దిగ్భ్రాంతి

రజనీకాంత్, కమల్ హాసన్ దిగ్భ్రాంతి

దాస‌రి మృతి పట్ల రజనీకాంత్, కమలహాసన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దాసరి నారాయణరావు తనకు ఆత్మీయుడు, స్నేహితుడని రజనీకాంత్ పేర్కొన్నారు. దేశంలోని గొప్ప దర్శకుల్లో దాసరి ఒకరని, ఆయ‌న లేని లోటు తీర్చ‌లేనిద‌న్నారు. దాస‌రి కుటుంబ స‌భ్యుల‌కు త‌న ప్ర‌గాఢ సానుభూతిని తెలుపుతున్న‌ట్లు చెప్పారు.

దాస‌రి మృతి ప‌ట్ల సంతాపం తెలుపుతున్న‌ట్లు కమల్ హాసన్ పేర్కొన్నారు. గ‌తంలో దాస‌రితో గ‌డిపిన రోజులు గుర్తు చేసుకుంటుంటే బాధ‌గా ఉంద‌న్నారు. దాస‌రి లేక‌పోవ‌డం తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌నిలోట‌ు అన్నారు.

ఇదీ లెక్క

ఇదీ లెక్క

కాగా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా తనలోని ప్రతిభను ఎప్పటికప్పుడు దాసరి పరిశ్రమకు పరిచయం చేశారు. 150కి పైగా చిత్రాలకు తెరకెక్కించారు. అలాగే నిర్మాతగా 53 చిత్రాలను నిర్మించారు. 250కిపైగా చిత్రాలకు మాటలు, పాటలు అందించడం విశేషం.

అవార్డులు, పురస్కారాలు

అవార్డులు, పురస్కారాలు

రెండు జాతీయ పురస్కారాలు, తొమ్మిది నంది పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు అందుకున్నారు దాసరి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించి ఉత్తమ నటుడిగా పేరు తెచుకున్నారు. దాసరికి కూతురు, ఇద్దరు కుమారులు ప్రభు, అరుణ్ కుమార్ ఉన్నారు.

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు

లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు

అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో దాసరి చోటు దక్కించుకున్నారు. జాతీయ, అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో దాసరి చిత్రాలు తెలుగు సినిమా సత్తాను చాటాయి.

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో..

అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో..

తాండ్ర పాపరాయుడు, సూరిగాడు వంటి చిత్రాలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించగా...కంటే కూతుర్నే కను చిత్రానికి 2000 సంవత్సరంలో జాతీయ పురస్కారం దక్కింది. 1982లో మేఘ సందేశం చిత్రానికి ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్నారు. చికాగో, కేన్స్, మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్ లో మేఘసందేశం చిత్ర ప్రదర్శన విమర్శకుల ప్రశంసలందుకుంది.

English summary
Mahesh Babu and Rajinikanth on Dasari Narayana Rao's death.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu