»   » ఫ్యాన్స్ ఇప్పటికైనా మారాలి: మహేష్, చరణ్ స్విట్జర్లాండ్లో... (హాలిడే ఫోటోస్)

ఫ్యాన్స్ ఇప్పటికైనా మారాలి: మహేష్, చరణ్ స్విట్జర్లాండ్లో... (హాలిడే ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, రామ్ చరణ్..... టాలీవుడ్లో టాప్ స్టార్స్. ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ఇరు కుటుంబాల మధ్య ఫ్రెండ్లీ రిలేషన్ ఉంది. అయితే ఇరు వర్గాల అభిమానుల మధ్య మాత్రం పరిస్థితి మరోలా ఉంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే ఇరు వర్గాల అభిమానుల మధ్య తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ చాలా వార్ నడుస్తోంది.

ప్రస్తుతం మహేష్ బాబు ఫ్యామిలీతో పాటు, రామ్ చరణ్ ఫ్యామిలీ స్విట్జర్లాండ్ లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. జూరిచ్ నగరంలో ఇరువురు కలిసారు. ఈ సందర్భంగా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసారు.

బియాండ్ ది బౌండరీస్... హ్యాపీ హాలిడేస్.... అంటూ మహేష్ బాబు, నమ్రత, రామ్ చరణ్, ఉపాసన ఈ ఫోటోలను తమ తమ సోషల్ మీడియా పేజీలో పోస్టు చేసారు. అందరూ ఇలా ఒకే రకమైన పోస్టు చేయడం వెనక పరోక్షంగా అభిమానులకు మెసేజ్ ఇచ్చారు. తామంతా ఫ్రెండ్స్, మీరు కూడా ఫ్రెండ్లీగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఈ పోస్టు చేసినట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికైనా అభిమానుల్లో మార్పు రావాలనేది వారి ఆశగా కనిపిస్తోంది.

మహేష్ బాబు

మహేష్ బాబు తన ట్విట్టర్లో చేసిన ట్వీట్ ఇదే. బియాండ్ ది బౌండరీస్...హ్యాపీ హాలిడేస్ అంటూ మహేష్ బాబు చేసిన ట్వీట్

rnrn

రామ్ చరణ్

రామ్ చరణ్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్టు చేసిన ఫోటో ఇది. మహేష్ బాబు మాదిరిగానే బియాండ్ ది బౌండరీస్...హ్యాపీ హాలిడేస్ అంటూ పోస్టు చేసారు.

మహేష్ బాబు, గల్లా జయదేవ్ ఫ్యామిలీ

మహేష్ బాబు, గల్లా జయదేవ్ ఫ్యామిలీ

మహేష్ బాబుతో పాటు ఆయన బావ గల్లా జయదేవ్ ఫ్యామిలీ కూడా ఈ హాలిడే ట్రిప్పులో ఉన్నారు. ప్రస్తుతం వీరంతా స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ లో గడుపుతున్నారు.

న్యూఇయర్ ఇక్కడే

న్యూఇయర్ ఇక్కడే

ప్రస్తుతం మహేష్ బాబు మురుగదాస్ మూవీలో నటిస్తున్నారు. అయితే క్రిస్ మస్, న్యూఇయర్ హాలిడే ఎంజాయ్ చేసేందుకు షూటింగుకు బ్రేక్ ఇచ్చారు. ఇంతకాలం ధృవ షూటింగులో బిజిగా గడిపిన రామ్ చరణ్ సినిమా హిట్ కావడంతో చాలా హ్యాపీగా ఉన్నాడు. మరో సినిమా మొదలయ్యే గ్యాపులో భార్య ఉపాసనతో కలిసి హాలిడే ఎంజాయ్ చేసేందుకు విదేశాల్లో వాలిపోయారు.

English summary
Currently Mahesh Babu and his brother-in-law Galla Jayadev are enjoying their holiday in Zurich, Switzerland and they will be cruising all along the Alps. Joining them is none other than Ram Charan, who is there along with wife Upasana to beat the pressure he has bore all these days with Dhruva.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu