For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మహేష్ బాబుని కాదని సల్మాన్ ఖాన్ తోనే...

  By Srikanya
  |

  ముంబై: ఇంతవరకూ "ఆజ్ కుచ్ తూఫానీ కర్తే హై" అంటూ ధమ్స్ అప్ నేషనల్ యాడ్ లో యాక్షన్ తో కనిపించి అలరించిన మహేష్ బాబు ఇక కనిపించరు. ఆయన ప్లేస్ లోకి సల్మాన్ ఖాన్ వచ్చి చేరారు. ఇంతకుముందు అక్షయ్ కుమార్ ప్లేస్ లోకి మహేష్ బాబు వచ్చి చేరారు. ఇప్పుడు సల్మాన్ ఖాన్.. ధమ్స్ అప్ కి నేషనల్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు. కోకోకోలా ఇండియా ప్రెవేట్ లిమెటెడ్ వారు సల్మాన్ తో ఎగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఇందులో గుడ్ న్యూస్ ఏమిటంటే ఆంధ్రప్రదేశ్ కి మాత్రం మహేష్ బాబే కొనసాగుతారు.

  ఇక కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు. మొత్తం దక్షిణాదిలో వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ, మిగతా అందరికన్నా ఎక్కువ డబ్బు సంపాదిస్తోంది. మహేష్‌ బాబు. పరిశ్రమలో వినపడేదాని ప్రకారం మహేష్‌ ఇప్పటివరకూ వివిధ కంపెనీలకు పనిచేయడం ద్వారా 35 నుంచి 40 కోట్ల రూపాయల వరకూ తీసుకున్నారని అంచనా. ఫిల్మ్‌ స్టార్ల బ్రాండింగ్‌ ఇమేజ్‌లో 20 శాతానికి పైగా మహేష్‌ సొంతం. ఆయన నటించిన వ్యాపార ప్రకటనలు తమిళనాడు, కర్నాటకల్లోని పత్రికల్లో, ఆయా భాషల టివి చానళ్ళలో ప్రసారం అవుతుంటాయి. ఏ సినీ రంగంలోనైనా టాప్‌ వన్ పొజిషన్‌లో ఉండే హీరోలను మాత్రమే తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేసుకునే థమ్స్‌ అప్‌ చిరంజీవి తరువాత మహేష్‌ బాబును ఆశ్రయించింది.

  థమ్స్‌ అప్‌ వంటి ఎన్నో కంపెనీలు తమ మొత్తం అమ్మకాల్లో 20 శాతం ఆంధ్రప్రదేశ్‌ నుంచే వస్తాయని వెల్లడించాయి. దేశం మొత్తం మీద పానీయాలకు అతిపెద్ద మార్కెట్‌గా ఆంధ్రతో పాటు కర్నాటకలు నిలువగా, తదుపరి స్థానంలో పంజాబ్‌ ఉంది. అందుకే ఉత్తరాదికి ఒకరిని ఎంపిక చేసుకునే కంపెనీలు సౌత్‌ ఇండియా కోసం కనీసం ఇద్దర్ని ఆశ్రయించాల్సి వస్తోంది. అందులో ఒకరు ఖచ్చితంగా తెలుగు సెలబ్రిటీగా ఉండేలా చూసుకుంటున్నాయి.

  గత నాలుగైదేళ్ళుగా ఆ సంస్థ చిత్రించిన వివిధ ప్రకటనల్లో మహేష్‌ కనిపిస్తూ, అభిమానులను అలరించారు. దీంతో పాటు ఐటిసి, యూనివర్‌సెల్‌, అమృతాంజన్‌, నవరత్న ఆయిల్‌, ఐడియా సెల్యులార్‌, వివెల్‌, ప్రొవోగ్‌ వంటి కంపెనీలతోనూ జతకట్టి ఒప్పందం కుదుర్చుకున్నారు. తమ బ్రాండిక్ కి ఏ సంస్థ అయినా ఎనిమిది కోట్ల రూపాయల వరకూ మహేష్‌ బాబుకు చెల్లించడానికి ముందుకొస్తున్నట్లు సమాచారం. పలు కార్పొరేట్‌ కంపెనీలు మహేష్‌ బాబు కాదన్న తరువాతే ఇతర హీరోలతో ఒప్పందాలకు వెళ్ళినట్టు తెలుస్తోంది.

  English summary
  The buzz is that the Tollywood superstar Mahesh Babu has been replaced by Bollywood actor Salman Khan in ThumsUp. Mahesh Babu fans celebrated the day when he replaced Akshay Kumar as the Brand Ambassador of ThumsUp and become the face of its nationwide campaign 'Aaj Kuch Toofani Kartey Hain'. They had enjoyed his stunts in the commercial of the soft drink, which has failed to woo the viewers in the North India. The good news is that Mahesh Babu will continue to be in the ThumsUp ad in Andhra Pradesh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X