twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోస్టర్ వివాదం: సమంతకు మహేష్ బాబు కౌంటర్

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : '1'నేనొక్కడినే చిత్రం రిలీజ్ అయినా ఈ చిత్రం పోస్టర్ వివాదానికి సంభందించిన టాపిక్ ఇంకా నడుస్తూనే ఉంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాని కలిసిన మహేష్ బాబుని ఈ పోస్టర్ విషయమై ప్రశ్నించారు. దానికి మహేష్ బాబు కూల్ గా సమాధానమిచ్చారు.

    మహేష్ మాట్లాడుతూ... " మేము(సమంత,మహేష్) మంచి స్నేహితులం , సమంత ఈ పోస్టర్ విషయమై ఏమైనా అఫెన్స్ గా ఫీలయ్యి ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పవచ్చు, అప్పుడు నేను నా దర్శకుడుని ఆ పోస్టర్ తీసేయమని చెప్పుదును. కానీ ఆమె అలాంటిదేమీ చెయ్యకుండా సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో దాన్ని పోస్ట్ చేసింది ." అన్నారు.

    Mahesh Babu Reply to Samantha Regressive Tweet

    ఇక రోటీన్‌ చిత్రాలకు భిన్నంగా వుండాలని వన్‌ చిత్రంలో నటించినట్టు హీరో మహేష్‌బాబు తెలిపారు. వన్‌ను విజయవంతం చేసినందుకు ప్రేక్షకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనువైట్ల దర్శకత్వంలో 'ఆగడు' చిత్రంలో నటిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

    మహేష్ ఫ్యాన్స్ సైతం ...సమంత, సిద్దార్థ గెట్ లాస్ట్ అంటూ వారిపై ట్వీట్ల వర్షం కురిపించారు. సమంత కామెంట్లను సపోర్టు చేసిన హీరో సిద్ధార్థపై కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేసారు. మీరిద్దరూ ఇండస్ట్రీ నుంచి వెళ్లి పోవాలంటూ ఫ్యాన్స్ కామెంట్ చేసారు. ఇంతకీ అసలు సమంత చేసిన ట్వీట్ ఏమిటీ... సమంత ట్వీట్ చేస్తూ... ''విడుదలకు సిద్ధమవుతున్న ఓ సినిమా పోస్టర్‌ ఈ మధ్య చూశాను. ఆ పోస్టర్‌లో హీరో,హీరోయిన్స్ ని చూస్తుంటే మహిళల గౌరవాన్ని దిగజార్చేలా ఉంది''- ఇదీ సమంత చేసిన ట్వీటు.

    14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంలో ఆచంట రామ్, ఆచంట గోపీచంద్, అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ : రత్నవేలు, సంగీతం : దేవిశ్రీప్రసాద్, కళ : రాజీవన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఫర్వేజ్ ఫిరోజ్, కెచ్చా, ఎడిటింగ్: కార్తిక శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కోటి పరుచూరి, నిర్మాతలు : రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, దర్శకత్వం : సుకుమార్.

    English summary
    In an interview to a private TV channel, when the interviewer asked Mahesh Babu to respond on ‘1-Nenokkadine poster controversy’ , he nonchalantly said, “As we (Mahesh and Samantha) are good friends, if Samantha felt anything offence with the poster she should have personally called me, and I would have asked my director to delete it. But it is totally condemnable posting against someone's wish in social networking site.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X