»   » తొలిసారిగా మహేష్ ముగ్గురుని ముగ్గులోకి...

తొలిసారిగా మహేష్ ముగ్గురుని ముగ్గులోకి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ముచ్చటగా ముగ్గురు భామలతో మహేష్‌బాబుతో కలసి ఆడిపాడబోతున్నారు. ఆయన సినిమాల్లో మహా అయితే ఇద్దరు హీరోయిన్స్ ఉన్నారు. కానీ మూడో వాళ్లకు ఛాన్స్ లేదు. అయితే ఇప్పుడు ముగ్గురు హీరోయిన్స్ చేయబోతున్నారు. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్న 'బ్రహ్మోత్సవం'లో ఈ మ్యాజిక్ జరగనుంది. ఇంతకీ వాళ్లు ఎవరూ అంటే ఆయనతో లక్కీ పెయిర్ గా నిలిచిన సమంత ఒకరు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మహేష్‌ సరసన నటించే హీరోయిన్ గా పలువురి పేర్లు వినిపించాయి. అయితే ఇటీవల ఆ అవకాశం సమంతనే వరించినట్టు తెలిసింది. 'దూకుడు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో వీరిద్దరూ సక్సెస్ ఫుల్ జోడీ అనిపించుకొన్నారు. ఈ చిత్రంనూ ఈ జోడీ కలిసి నటించబోతున్నట్టు సమాచారం.

పీవీపీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంతతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. రెండో హీరోయిన్ గా ప్రణీతకి అవకాశం దక్కినట్టు తెలిసింది. మూడో హీరోయిన్ ఎంపికపై కసరత్తులు జరుగుతున్నాయి.

త్వరలోనే ఈ సినిమాకోసం మహేష్‌ రంగంలోకి దిగబోతున్నాడు. డిసెంబరులోపు చిత్రాన్ని పూర్తి చేయాలనే ప్రయత్నాల్లో ఉంది చిత్రం యూనిట్.

Mahesh Babu to romance three heroines in his next

మహేష్ బాబు తాజా చిత్రం ‘శ్రీమంతుడు' విశేషాలకు వస్తే....

ఈ చిత్రం రిలీజ్ డేట్ పై ఉన్న అనుమానాలు,రూమర్స్ కు తెరదించుతూ...చిత్రం నిర్మాతలు, దర్శకుడు కొత్త రిలీజ్ తేదీని ప్రకటించారు. ఆగష్టు 7న సినిమాని రిలీజ్ చెయ్యడానికి డేట్ ని లాక్ చేసారు. మహేష్ బాబు పుట్టిన రోజు ఆగష్టు 9. అంటే పుట్టిన రోజుకు రెండు రోజులు ముందుగానే కానుక వచ్చేస్తుందన్నమాట. అలాగే ఆడియోని జూలై 18న రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్ర టీం అధికారికంగా తెలియజేసింది.

ప్రస్తుతం ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. జూన్ 27కి షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేయనున్నారు. దానికోసమే అన్ని కార్యక్రమాలను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

మరోప్రక్క ‘శ్రీమంతుడు' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మరో ప్రక్క ఈ చిత్రం ఆడియో విడుదల కోసం సైతం ఫ్యాన్స్ ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఆడియో సాంగ్ లీకైందనే వార్త అందరినీ కలవరపరిచింది.

అయితే ఈ విషయమై ఈ చిత్రం నిర్మాతలు సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ద్వారా వివరణ ఇచ్చారు. వారు పోస్ట్ చేస్తూ... శ్రీమంతుడు పాట లీకైందని తెలిసింది.అయితే మా సినమాలో ది మాత్రం కాదన్నారు.

మరో ప్రక్క తాజాగా ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని భారీ మొత్తానికి జీ తెలుగు వారు సొంతం చేసుకున్నారు. మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, సుకన్య, రాహుల్ రవీంద్రన్, పూర్ణ, సనమ్ శెట్టి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించనున్నాడు.

English summary
Mahesh Babu is gearing up to start shooting for his next, Brahmotsavam. However, the latest we hear is that the Pokiri star will romance three beautiful ladies in the movie.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu