»   » కాపీ కొట్టారు.... మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ (ఇదిగో సాక్ష్యం)

కాపీ కొట్టారు.... మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ (ఇదిగో సాక్ష్యం)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'బ్రహ్మోత్సవం'. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇందులో మహేష్ బాబు వెరైటీగా ఉన్న మూడు చక్రాల బైకుపై కనిపించారు. ఈ పోస్టర్ చూసిన వారంతా అబ్బ...సూపర్ ఉందంటూ మెచ్చుకున్నారు.

అయితే ఈ బైక్ ఐడియా సినిమా యూనిట్ సభ్యుల సొంత ఐడియా కాదని తేలిపోయింది. రాజస్థాన్ టూరిజం వారు తమ ప్రమోషన్ కోసం ఓ యాడ్‌లో మూడు చక్రాల బైక్‌ని వాడారు. ఇదే కాన్సెప్టుని ఇపుడు బ్రహ్మోత్సవం విషయంలో వాడారు. ఈ విషయం ఇంటర్నెట్ ద్వారా అంతటా పాకి పోయింది.


అయినా ఈ రోజుల్లో సినిమాల కథలు, కాన్సెప్టులు, మ్యూజిక్ లాంటివి కాపీ కొట్టడం కామన్ అయిపోయింది. ఓ చిన్న పోస్టర్ కాపీ కొట్టినందుకు ఇంత రాద్దాంత అవసరం లేదనేది కొందరి వాదన. ఇదో పెద్ద విషయమే కాదంటున్నారు అభిమానులు.


సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
మే 7న సినిమా ఆడియో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే సినిమా మరో నెల రోజుల వరకు రిలీజ్ అయ్యే అవకాశాలే కనిపించడం లేదు. కొన్ని రోజుల క్రితం ఈ చిత్ర పీఆర్ఓ బిఏ రాజు 'బ్రహ్మోత్సవం' మే 20న వస్తుందని ప్రకటించినప్పటికీ....విడుదల ఆరోజు సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కాక పోవడం వల్లనే ఈ ఆలస్యం అని అంటున్నారు. మే 27న సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.


మహేష్ బాబు బైక్

మహేష్ బాబు బైక్

బ్రహ్మోత్సవం సినిమాలో మహేష్ బాబు బైక్ ఇదే...


దీని నుండే కాపీ కొట్టారు

దీని నుండే కాపీ కొట్టారు

రాజస్థాన్ టూరిజం వారు తమ ప్రమోషన్ కోసం ఓ యాడ్‌లో మూడు చక్రాల బైక్‌ని వాడారు.


బ్రహ్మోత్సవంలో..

బ్రహ్మోత్సవంలో..

దే కాన్సెప్టుని ఇపుడు బ్రహ్మోత్సవం విషయంలో వాడారు. ఈ విషయం ఇంటర్నెట్ ద్వారా అంతటా పాకి పోయింది.


యాడ్ వీడియో

రాజస్థాన్ టూరిజం వారి యాడ్ ఫిల్మ్ వీడియో


English summary
Mahesh’s bike idea is copied from the advertisement of Rajasthan tourism. In the recently released ad of Rajasthan tourism.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu