»   » అదే భయం, మర్చిపోలేను, సెంటిమెంట్, అందుకే ఆలస్యం: మహేష్ బాబు

అదే భయం, మర్చిపోలేను, సెంటిమెంట్, అందుకే ఆలస్యం: మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా శ్రీకాంత్ అడ్డాల ద్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్టెనర్ 'బ్రహ్మోత్సవం'. పి.వి.పి సినిమా, మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థలపై సంయుక్తంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నె నిర్మాతలు.

సినిమా మే 20న విడుదల అవుతున్న నేపథ్యంలో ఆదివారం మీడియాతో మీట్ అయి సినిమాకు సంబంధించిన విశేషాలు చెప్పుకొచ్చారు హీరో మహేష్ బాబు, దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు మహేష్ బాబు సమాధానం ఇచ్చారు.


ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ సినిమా ను మే 20న విడుదల కానుంది. అనుకున్న తేదీలో సినిమా విడుదల కావడానికి యూనిట్ అంతా కష్టపడ్డారు. ఎట్టకేలకు అనుకున్న రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం.


శ్రీకాంత్ అడ్డాల గురించి మాట్లాడుతూ...సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో శ్రీకాంత్ అడ్డాలగారు నన్ను ప్రెజంట్ చేసిన తీరు, బ్రహ్మోత్సవంలో చూపించిన తీరు పూర్తి భిన్నంగా ఉంటుంది. నేను కూడా చాలా ఎగ్జయిట్ మెంట్ తో వెయిట్ చేస్తున్నాం. చాలా ఫ్రెష్ స్టోరీ. ఇలాంటి పాయింట్ గతంలే నేను సినిమా నేను చేయలేదు. శ్రీమంతుడు సినిమా చేస్తున్నప్పుడే శ్రీకాంత్ గారు ఈ కథను నాకు చెప్పారు, నాకు నచ్చడంతో చేయడానికి రెడీ అయ్యాను.


నిర్మాత గురించి మాట్లాడుతూ...పివిపి గారు మాకు ఏదీ కావాలంటే అది అందించడం వల్లే సినిమా అవుట్ పుట్ ఇంత బాగా వచ్చింది. కంటెంట్ ను నమ్మి మాతో ట్రావెల్ చేసినందుకు ఆయనకు థాంక్స్.


బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించిన మరిన్ని విశేషాలతో పాటు భార్య గురించి, కుటుంబం గురించి, గౌతం, సితార గురించి, తన తర్వాతి ప్రాజెక్టుల గురించి మహేష్ బాబు చెప్పిన మరిన్ని విషయాలు స్లైడ్ షోలో....


లక్కీ, టెన్షన్లు లేవు

లక్కీ, టెన్షన్లు లేవు

టెన్షన్లు లేకపోతే, ఇల్లు బావుంటే ఆహ్లాదకరంగా ఉంటారు. లక్కీగా నాకు అలాంటి మంచి కుటుంబం దొరికింది. అందువల్ల ఆ టెన్షన్లు కూడా లేవు.


అన్నీ నమ్రతే..

అన్నీ నమ్రతే..

నిర్మాణ వ్యవహారాలతో పాటు, సినిమా ప్రచార వ్యవహారాలన్నిటినీ నా భార్యే చూసుకొంటుంది. నా బాధ్యత కేవలం మంచి కథల్ని ఎంచుకోవడం, షూటింగులో పాల్గొనడం, అందు వల్ల చాలా ఫ్రీగా అనిపిస్తుంది.


ప్యూర్ గా ఉండాలి.

ప్యూర్ గా ఉండాలి.

బ్రహ్మోత్సవం వంటి సినిమా చేసేటప్పుడు ప్యూర్ గా ఉండాలి. ఈ కథ వేరుగా ఉంటుంది. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్.


వాటిని గుర్తు చేస్తుంది

వాటిని గుర్తు చేస్తుంది

జీవితంలో ఇప్పుడు పోటీ ప్రపంచంలో చిన్న చిన్న ఫీలింగ్స్ ను, ఎమోషన్స్ క్యారీ చేయడం మరచిపోతున్నాం. మా బ్రహ్మోత్సవం సినిమా వాటిని గుర్తుకు తెస్తుంది.


సితార సెంటిమెంట్

సితార సెంటిమెంట్

పిల్లలు చాలా స్వచ్ఛమైన వారు. అలాంటివారు ఆడియో వేడుకలకు వస్తే మంచి జరుగుతుందని నా నమ్మకం. ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా ఆడియో వేడుకకు గౌతమ్‌ తొలిసారి వచ్చాడు. ఆ సినిమా ఎంత పెద్ద హిట్‌ అయిందో తెలిసిందే. ఈసారి సితార పాప వచ్చింది. తప్పకుండా మంచి జరుగుతుందనే నమ్మకంతో సితార సెంటిమెంట్ అని చెప్పాను.


బుర్రిపాలెం గురించి..

బుర్రిపాలెం గురించి..

మొన్న వెళ్లినప్పుడు అక్కడివాళ్లు చూపించిన ఆదరాభిమానాలను మర్చిపోలేను. నేను ఉన్నది హైదరాబాదే అయినా ఎప్పుడూ బుర్రిపాలెంలోనే ఉన్నట్టు అనిపించింది..


పిల్లల గురించి

పిల్లల గురించి

ఇద్దరిలోనూ. ఇద్దరూ అల్లరిగానే ఉంటారు. నాతో క్లోజ్‌గా ఉంటారు. ఇద్దరూ నాలుగు భాషల్లో మాట్లాడుతున్నారు. తెలుగు, ఇంగ్లిష్‌, హిందీ, మరాఠీ ఇద్దరికీ వచ్చు. సితార అల్లరి చాలా ఎక్కువ చేస్తుంది. చుట్టూ ఉన్న వాళ్లతో తేలిగ్గా కలిసిపోతుంది. గౌతమ్‌ నేను నవ్వినట్టు నవ్వుతాడు. చుట్టూ ఎక్కువ మంది ఉంటే తేలిగ్గా కలవలేడు.


భయం

భయం

శుక్రవారం భయం ఉంటుందండీ. అంత కష్టపడి చేసిన సిని మా ఫలితం విషయం ఆలోచించకుండా ఎలా ఉండగలం


అందుకే లేటు

అందుకే లేటు

సినిమా నిజానికి ఏప్రిల్‌లోనే విడుదల చేయాలి. చిత్రీకరణ సమయంలో చిన్న చిన్న అవాంతరాలు ఎదురయ్యాయి. చాలామంది నటులున్న సినిమా ఇది. అనుకొన్న సమయానికి అనుకున్నట్టుగా ఓ సన్నివేశం చేయలేకపోయినా మళ్లీ ఆ నటుల కాల్షీట్లన్నీ దొరకడానికి చాలా సమయం పట్టేది. అలా ఈ సినిమా కాస్త ఆలస్యమైందంతే.


ప్రణాళికలు లేవు, అదృష్టం

ప్రణాళికలు లేవు, అదృష్టం

ప్రణాళికలు వేసుకొని సినిమాలు చేయడం నాకు అలవాటు లేదు. దేవుడి ఆశీర్వాదంతోనే ‘బ్రహ్మోత్సవం' చేశాననుకొంటున్నా. ‘శ్రీమంతుడు' చిత్రీకరణ సమయంలోనే ఈ కథ విన్నా. బాగా నచ్చింది. ‘శ్రీమంతుడు'లాంటి ఓ మంచి సినిమా తర్వాత మరోసారి బలమైన కథ నాకు దొరకడం అదృష్టం.


కుటుంబ కథలు చాలా శక్తిమంతమైనవి

కుటుంబ కథలు చాలా శక్తిమంతమైనవి

కుటుంబ కథలకి కాలం చెల్లడమంటూ ఉండదు. కాకపోతే ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'కు ముందు కొంతకాలం కుటుంబ అనుబంధాలతో కూడిన కథలేవీ తెరపైకి రాలేదు. అంతా యాక్షన్‌ పంథాలోనే కథల్ని వండేవారు. కానీ ‘సీతమ్మ...'లాంటి సినిమా తర్వాత మంచి కథయితే చాలు, కుటుంబ కథల్నీ ప్రేక్షకులు ఆదరిస్తారన్న విషయం అర్థమైంది.


బ్రహ్మోత్సవంలో..

బ్రహ్మోత్సవంలో..

ఆధునిక జీవితంలో కుటుంబాలు చిన్నవైపోయాయి. అందరూ కలుసుకుంటే ఓ ఉత్సవంలా ఉంటుంది కదా అనే చెబుతున్నాం. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ ఒక రకమైన ఆనందానుభూతికి గురవుతారు. ఇందులోని భావోద్వేగాలన్నీ ప్రేక్షకులకు చేరువవుతాయని నా నమ్మకం.


కళ్లలో నీళ్లు తిరిగాయి

కళ్లలో నీళ్లు తిరిగాయి

దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల ఆ ఆలోచన చెప్పగానే వెంటనే కనెక్ట్‌ అయిపోయా. తండ్రికి చెప్పులు తొడిగి ఆశీర్వాదం తీసుకొనే సన్నివేశమది. అది తెరపై చాలా బాగుంటుంది. ఆ సన్నివేశం తీసేటప్పుడు అందరికీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. తెరపై చూసినప్పుడూ అదే అనుభూతి కలుగుతుంది.


నాన్నతో చూడాలంటే భయం

నాన్నతో చూడాలంటే భయం

నాన్నతో కలిసి సినిమా చూడాలంటే నాకు భయం. ఆయన నాకు చెప్పకుండానే సినిమా చూసేస్తారు. చూశాక ఆయనే నాకు ఫోన్‌ చేస్తుంటారు. ఆ ఫోన్‌ కాల్‌ కోసం ఎదురు చూస్తుంటా.


సితార హీరోయిన్ అవుతుందనే సమంత కామెంట్ మీద

సితార హీరోయిన్ అవుతుందనే సమంత కామెంట్ మీద

తను సరదాగా అందేమో? సితార చిన్న పిల్ల. తను ఏం అవుతుందో అప్పుడే ఎలా చెప్పగలం. కానీ చాలా హుషారుగా ఉంటుంది. పాటలు పాడుతుంది.


కనెక్ట్ అవ్వాలి

కనెక్ట్ అవ్వాలి

ఓ కథ నాకు నప్పుతుందో లేదో అనుభవం ద్వారా తెలిసిపోతుంది. నేను కనెక్ట్‌ అయిన కథలనే చేస్తా. అలాగని ఎలాంటి సినిమాలు చేయాలో తెలిసిపోయింది అని చెప్పను. కొన్ని తప్పులు చేస్తాం. కానీ ఇప్పటి వరకూ నేను నమ్మిన కథల్నే ఒప్పుకొన్నా. ఓ కథ వింటున్నప్పుడు చేయాలా, వద్దా అనేది అప్పటికప్పుడు నిర్ణయం తీసేసుకొంటా.


నెక్ట్స్ ప్రాజెక్ట్...

నెక్ట్స్ ప్రాజెక్ట్...

నెక్ట్స్ ప్రాజెక్ట్ మురుగదాస్ గారి దర్శకత్వంలో ఉంటుంది. ఆ సినిమా కోసం నేను కూడా ఎదురుచూస్తున్నాను. ఈ సినిమాను తెలుగు, తమిళంలో నిర్మిస్తున్నాం.


శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ...

శ్రీకాంత్ అడ్డాల మాట్లాడుతూ...

ఫస్ట్ లుక్ పోస్టర్ లో సూపర్ స్టార్ మహేష్ తండ్రి కాళ్లకే చెప్పులు తొడుగుతుంటాడు. ఈ పోస్టర్ ను విడుదల చేసేటప్పుడు మేం ఫ్యాన్స్ పాజిటివ్ గానే ఆలోచిస్తారని అనుకున్నాం. అనుకున్నట్టుగానే ఫ్యాన్స్ పాజిటి గానే తీసుకున్నారు. టైటిల్ లో శ్రీవారి పాదాలను చూపించడానికి కారణం, హీరో అంత వినయంగా ఉంటారని చూపించడమే. వినయంగా ఉంటే మంచిదే కదా మరి..సాధారణంగా ఊళ్లో జరిగే బ్రహ్మోత్సవాలు జరగుతుంటాయి కదా, దాన్ని బట్టే టైటిల్ ను పెట్టాం. మంచి లవ్ స్టోరీ. ఫ్యామిలీతో విలువలతో కలిసి ఉంటుంది.


English summary
Mahesh Babu's interview about upcoming movie Brahmotsavam.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu