»   » మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ రిలీజ్ డేట్ ఖరారు!

మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ రిలీజ్ డేట్ ఖరారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం'. తెలుగు, త‌మిళ్ లో పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట.

బంధాలు..అనుబంధాలు నేప‌థ్యంతో విజ‌య‌వాడ బ్యాక్ డ్రాప్ తో రూపొందే ఈ బ్ర‌హ్మోత్స‌వం సినిమా తిరుప‌తిలో జ‌రిగే బ్ర‌హ్మోత్స‌వం స‌న్నివేశంతో శుభం కార్డ్ ప‌డుతుంద‌ని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది.


Mahesh Babu's Brahmotsavam release date

సమ్మర్ సీజన్లో మహేష్ బాబు సినిమా వచ్చి దాదాపు పదేళ్లయింది. 2006లో ఆయన నటించిన ‘పోకిరి' సినిమా విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ త‌రువాత మ‌ళ్లీ వేస‌వి సీజ‌న్‌లో మహేష్ సినిమాల‌ేవీ విడుదల కాలేదు.


దశాబ్దం గ్యాప్ తర్వాత మహేష్ బాబు నటించిన 'బ్ర‌హ్మోత్స‌వం' 'పోకిరి' రిలీజైన ఏప్రిల్ నెల‌లోనే తీసుకువ‌చ్చే దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ స్వరాలందిస్తున్నారు. గతంలో మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కూడా కుటుంబ భావోద్వేగాల నేపధ్యంలో సిద్దం అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ ని ఈ సారి కూడా రిపీట్ చేయనున్నారు.


బ్రహ్మోత్సవం చిత్రాన్ని పి.వి.పి సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. సత్యరాజ్‌, జయసుధ, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, కూర్పు: శ్రీకర ప్రసాద్‌, కళ: తోట తరణి.

English summary
Film Nagar source said that Mahesh Babu's Brahmotsavam releasing on April 08, 2016.
Please Wait while comments are loading...