»   » పదేళ్ల తర్వాత మహేష్ బాబు మళ్లీ అదే సీజన్లో...

పదేళ్ల తర్వాత మహేష్ బాబు మళ్లీ అదే సీజన్లో...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సమ్మర్ సీజన్లో మహేష్ బాబు సినిమా వచ్చి దాదాపు పదేళ్లయింది. 2006లో ఆయన నటించిన ‘పోకిరి' సినిమా విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ త‌రువాత మ‌ళ్లీ వేస‌వి సీజ‌న్‌లో మహేష్ సినిమాల‌ేవీ విడుదల కాలేదు.

దశాబ్దం గ్యాప్ తర్వాత మహేష్ బాబు నటించిన 'బ్ర‌హ్మోత్స‌వం' 'పోకిరి' రిలీజైన ఏప్రిల్ నెల‌లోనే తీసుకువ‌చ్చే దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శర వేగంగా సాగుతోంది.


Mahesh Babu's Brahmotsavam set for summer release

ఈ సినిమాలో మహేష్‌ ముగ్గురు భామలతో ఆడిపాడనున్నారు. సమంత, కాజల్‌ అగర్వాల్‌, ప్రణీత హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ స్వరాలందిస్తున్నారు. గతంలో మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కూడా కుటుంబ భావోద్వేగాల నేపధ్యంలో సిద్దం అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ ని ఈ సారి కూడా రిపీట్ చేయనున్నారు.


బ్రహ్మోత్సవం చిత్రాన్ని పి.వి.పి సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. సత్యరాజ్‌, జయసుధ, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, కూర్పు: శ్రీకర ప్రసాద్‌, కళ: తోట తరణి.

English summary
Film Nagar source said that Mahesh Babu's Brahmotsavam set for summer release.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu