»   » నమ్మి తీరాల్సిందే: మహేష్ ‘బ్రహ్మోత్సవం’ విషయంలో రుజువైంది!

నమ్మి తీరాల్సిందే: మహేష్ ‘బ్రహ్మోత్సవం’ విషయంలో రుజువైంది!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా వాళ్లు సెంటిమెంట్లను ఎక్కువగా పట్టించుకుంటారనే విషయం తెలిసిందే. అయితే కొందరు ఈ కాలంలో కూడా ఇలాంటి నమ్మడం ఏమిటి? అని కొట్టి పారేస్తుంటారు. కొందరు హీరోలు కూడా ఇలానే భావించి లైట్ తీసుకుని నష్టపోయారు. అయితే అవి ఎలాంటి తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయో 'బ్రహ్మోత్సవం' సినిమా విషయంలో మరోసారి రుజువైంది.

మహేష్ బాబుకు సినిమా మే నెలలో రిలీజ్ అయితే భారీగా ప్లాప్ అవుతుందనే సెంటిమెంటు ఉంది. బ్రహ్మోత్సవం విషయంలో ఇది అక్షరాల నిజమైంది. చాలా మంది లైట్ తీసుకున్నట్లే మహేష్ బాబు మే నెల ప్లాపు సెంటిమెంటును పెద్దగా పట్టించుకోలేదు. దర్శక నిర్మాతలు కూడా ఈ విషయం లైట్ తీుకున్నారు. ఇపుడు ఆ సెంటిమెంటే మహేష్ బాబు సినిమాను కబలించిందని చర్చించుకుంటున్నారు.

Mahesh Babu's Brahmotsavam Succumbs To Sentiment

గతంలో మహేష్ బాబు నటించిన 'నిజం' సినిమా తేజ దర్వకత్వంలో వచ్చిన సంగతి తెలిసిందే. మే 23, 2003లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా పడింది. తర్వాత 2004లో మే 14న ఎస్.జె.సూర్య దర్శకత్వంలో చేసిన 'నాని' సినిమా కూడా మహేష్ బాబు కెరీర్లోనే పెద్ద డిజాస్టర్ అయింది. తేజ అప్పటికే 'జయం' లాంటి సూపర్ హిట్ సినిమా చేసి మంచి ఊపు మీద ఉండగా, ఎస్.జె.సూర్య 'ఖుషి' లాంటి హిట్ సినిమా చేసారు.

ఈ రెండు సినిమాలు భారీగా ప్లాప్ అయిన తర్వాత ఇప్పటి వరకు మహేష్ బాబు సినిమా మళ్లీ మే నెలలో రిలీజ్ కాలేదు. ఇన్నాళ్లకు 'బ్రహ్మోత్సవం' వచ్చింది. ఈ సినిమా హిట్టయితే మహేష్ బాబు మే నెల ప్లాపు సెంటిమెంటు నుండి బయట పడతారని అంతా అనుకున్నారు. కానీ అలా జరుగలేదు. అందుకే ఇలాంటి సెంటిమెంట్లు నమ్మి తీరాల్సిందే అని అంటున్నారు సినీ జనాలు.

English summary
Tollywood is one industry, which believes in sentiments to a larger extent, though there are many instances, which broke the jinx. However, Mahesh Babu's Brahmotsavam couldn't come out of the much publicized sentiment and finally it had to succumb.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu