»   » మహేష్ ...న్యూ ఇయిర్ ఇక్కడ కాదు

మహేష్ ...న్యూ ఇయిర్ ఇక్కడ కాదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : శ్రీమంతుడు సినిమా హిట్ తో మంచి ఫామ్ తో మహేష్ దూసుకెళుతున్నాడు. అయితే తన సినిమాకు పని చేసే వారితో పెద్దగా కలవలేడు. పార్టీ కల్చర్ కి పూర్తి దూరంగా ఉంటూంటాడు. అవకాసం,సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబం, పిల్లలతో స్పెండ్ చేయటానికి ఇంట్రెస్ట్ చూపెడతాడు. ఎదుగుతున్న పిల్లలను సరదాగా రకరకాల దేశాలుశెలవుల్లో తీసుకువెళ్తూంటాడు.

క్రితం సంవత్సరం ప్యారిస్, బ్యాంకాక్ లాంటి విదేశాలు తిరిగిన ఈ అందగాడు, ఈ 2016 న్యూ ఇయిర్ ఫంక్షన్ కి మరో దేశం వెళుతున్నాడని సమాచారం. ప్రస్తుతం బ్రహ్మోత్సవం షుటింగ్ ని ఊటీలో ఫినిష్ చేసుకుని హైదరాబాద్ వచ్చారు.

బ్రహ్మోత్సవం తర్వాత ఏప్ర్లిల్ నుండి మురుగదాస్ సినిమాలో నటిస్తారు. ఈ చిత్రం సుమారు 100 కోట్ల బడ్టెట్ ఉంటుందని అందరు అనుకుంటున్నారు. కుదిరితే కనుక బాలివుడ్ భామ శ్రద్దా కవూర్ ని హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉంది. ఈ సినిమాకు ఠాగుర్ మధు మరియు ఎన్.వి. ప్రశాద్ లు ప్రోడ్యుసర్స్ గా ఉన్నారు.

Mahesh Babu 's New Year celebrating with kinds.

మురుగదాస్ గతంలో తమిళంలో తీసిన రమణ చిత్రాన్ని చిరంజీవి తెలుగులో... ‘ఠాగూర్' పేరుతో రీమేక్ చేసారు. తర్వాత మురుగదాస్, చిరంజీవి కాంబినేషన్లో ‘స్టాలిన్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత ఇద్దరూ కలిసి మరో స్టైయిట్ తెలుగు సినిమా చేయాలనుకున్నారు.

చిరంజీవిని మైండ్ లో పెట్టుకుని మురుగదాస్ ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసారు. అయితే చిరంజీవికి ఆ స్టోరీ నచ్చక రిజెక్ట్ చేసారు. మురుగదాస్ అదే స్టోరీని మహేష్ బాబుకు చెప్పాడని, మహేష్ బాబుకు నచ్చడంతో ఓకే చేసారని అంటున్నారు. హైకోర్ట్, న్యాయ వ్యవస్థ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్.

English summary
Latest reports say Mahesh Babu will be celebrating the New Year in another foreign location.
Please Wait while comments are loading...