»   » మహేష్ బాబు అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్

మహేష్ బాబు అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేష్ బాబు అభిమానులకు నూతన సంవత్సర కానుక అందబోతోంది. మహేష్ బాబు హీరోగా నటించిన ‘బ్రహ్మోత్సవం' టీజర్‌ని అభిమానులకు కొత్త సంవత్సరం కానుకగా జనవరి ఒకటిన విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ‘పివిపి సినిమా' వారు ప్రకటించారు. జనవరి 1వ తేదీ ఉదయం 9.26 గంటలకు టీజర్ విడుదల కానుంది.

brahmotsavam

ఈ చిత్రానికి శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. ‘బ్రహ్మోత్సవం' ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా హైదరాబాద్ లో కాకుండా తిరుపతిలో చేయాలని నిర్ణయించారు. బ్రహ్మోత్సవాలు అంటే ముందుగా మనకు గుర్తుకొచ్చేది తిరుపతి. అందుకే ఈ సినిమా ఫంక్షన్ ఇక్కడ నిర్వహించాలని డిసైడ్ చేసినట్లు తెలుస్తోంది. మహేష్ బాబు సరసన సమంత, కాజల్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో సత్యరాజ్, జయసుధ, రేవతి, నరేష్, రావు రమేష్, తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్, తులసి, ఈశ్వరీరావు, షాయాజీ షిండే, కృష్ణభగవాన్, రజిత, కాదంబరి కిరణ్, చాందిని చౌదరి తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ : ఆర్.రత్నవేలు, సంగీతం : మిక్కీ జె. మేయర్, డాన్స్ : రాజు సుందరం, ప్రొడక్షన్ డిజైనర్ : తోట తరణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సందీప్ గుణ్ణం, నిర్మాతలు : పెరల్ వి.పొట్లూరి, పరమ్ వి.పొట్లూరి, కథ,స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల.

English summary
Mahesh Babu is going to delight his fans on the New Year with a special gift. The gift of course is the first look of his upcoming flick Brahmotsavam.
Please Wait while comments are loading...