»   » రజనీకాంత్‌తో మహేశ్‌బాబు ఢీ.. సల్మాన్‌తో తప్పుకున్నాడు.. అజిత్‌తో అమీతుమీ..

రజనీకాంత్‌తో మహేశ్‌బాబు ఢీ.. సల్మాన్‌తో తప్పుకున్నాడు.. అజిత్‌తో అమీతుమీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రిన్స్ మహేశ్ బాబు గతంలో ముందెన్నడూ లేని విధంగా సినిమాల వేగం పెంచుతున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ చిత్రంలో ఓ వైపు నటిస్తూనే డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో మరో సినిమాను మహేశ్ పట్టాలెక్కించాడు. స్పైడర్ చిత్రాన్ని ఆగస్టులో రీలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తూనే.. వచ్చే సంక్రాంతి బరిలో కొరటాల శివ సినిమాను ప్లేస్ చేస్తున్నారు. మహేశ్ కెరీర్‌లో 24వ చిత్రంగా రూపొందనున్న ఈ సినిమా షూటింగ్ మే 22న ప్రారంభమైన సంగతి తెలిసిందే. కొరటాల, మహేశ్ కాంబినేషన్‌లో వచ్చిన శ్రీమంతుడు ఘనవిజయం సాధించింది.

సంక్రాంతి బరిలో

సంక్రాంతి బరిలో

ఒకవేళ సంక్రాంతి బరిలోకి మహేశ్ దిగితే చాలా గట్టిపోటే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే రజనీ, శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న రోబో 2.0 సినిమా 2018 జనవరిలో రిలీజ్ ముస్తాబవుతున్నది. కొరటాల సినిమాను జనవరి 11 విడుదల చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆగస్టులో విడుదల కానున్న స్పైడర్ చిత్రం అజిత్ కుమార్ చిత్రం వివేకం సినిమాతో ఢీ కొట్టబోతున్నది. ఈ రెండు చిత్రాలు ఆగస్టులో విడుదల కానున్నాయి. వాస్తవానికి ఈ చిత్రం జూన్‌లో సల్మాన్ ఖాన్ ట్యూబ్‌లైట్ చిత్రంతో తలపడాల్సింది.


ఆగస్టులో స్పైడర్

ఆగస్టులో స్పైడర్

స్పైడర్ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. ఓ వైపు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తూనే దర్శకుడు మురుగదాస్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫిక్ పనులను మకుట గ్రాఫిక్స్ అప్పజెప్పారు. బాహుబలి సినిమాకు వీఎఫ్ఎక్స్ పనులను మకుట గ్రాఫిక్స్ చేపట్టిన సంగతి తెలిసిందే.


100 కోట్లతో..

100 కోట్లతో..

స్పైడర్ చిత్రం మహేశ్ బాబు కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రం. ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందుతున్నది. ఈ చిత్ర సన్నివేశాలను వియత్నాంలో హాలీవుడ్ స్టంట్ మాస్టర్ల పర్యవేక్షణలో జరిగాయి. వాస్తవానికి ఈ సినిమాను జూన్ 23వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తికాకపోవడంతో ఆగస్టుకు వాయిదా వేశారు.


యాక్షన్ ఎంటర్ టైనర్..

యాక్షన్ ఎంటర్ టైనర్..

ఆగస్టులో రిలీజ్‌కు సిద్ధమవుతున్న అజిత్ కుమార్ వివేకం కూడా యాక్షన్ ఎంటర్ టైనర్. మహేశ్ నటిస్తున్న స్పైడర్ కూడా దాదాపు అలాంటిందే. స్పైడర్‌లో మహేశ్, వివేకంలో అజిత్ కూడా ఇంటెలిజెన్స్ ఆఫీసర్లుగా నటిస్తున్నారు. దాంతో ఆగస్టు నెలలో యాక్షన్ చిత్రాల జోరులో ప్రేక్షకులు తడిసి ముద్దవ్వడం ఖాయం.English summary
Mahesh Babu‘s SPYder with AR Murugadoss is yet to be wrapped up, the Telugu superstar 24th project went on floors. this project have been revealed but the movie already has a release date. It’s slated for a Jan 2018 Sankranthi release! After 2.0’s shift to Jan 2018.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu