అన్ పాపులరైనా...‘1’ స్టోరీ మహేష్ ఒప్పుకోవడం వెనక?
హైదరాబాద్: తెలుగు నాట కమర్షియల్ అంశాలతో కూడిన కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్, రొమాన్స్ డ్రామాలు నడుస్తున్న తరుణంలో.......ఇక్కడ అంతగా పాపులారిటీ లేని సైకలాజికల్ థ్రిల్లర్ స్టోరీని మహేష్ బాబు ఎందుకు ఒప్పుకున్నాడు? అనే సందేహం చాలా మంది నుండి వ్యక్తం అవుతోంది.
ఈ ప్రశ్నలకు ఇటీవల ఇంటర్వ్యూలో మహేష్ బాబు సమాధానం ఇస్తూ....రొటీన్ స్టోరీలు కాకుండా కొత్తగా చేయాలనే ఆలోచనే ఇందుకు కారణం. మన పక్క రాష్ట్రాల వారు తెలుగు సినిమా గురించి గొప్పగా చెప్పుకోవాలి. అందుకే హాలీవుడ్ స్టాండర్ట్స్‌తో ఈ సినిమా చేసాం. ఈ చిత్రం నా కెరీర్లో ఒక మెమోరబుల్ సినిమా, కెరీర్ల ఒక మంచి సినిమా చేసాననే తృప్తి మిగిలింది' అన్నారు.

'1 నేనొక్కడినే' చిత్రం గురువారంతో వారం రోజులు పూర్తి చేసుకుంది. తొలి వారం ఈచిత్రం బాక్సాఫీసు వద్ద డీసెంట్ కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం అనుకున్న అంచనాలను మాత్రం అందుకోలేక పోయింది. ఓవరాల్‌గా ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్‌లో 1000కిపైగా థియేటర్లు, కర్నాటక, మహారాష్ట్రా, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల్లో దాదాపు 400లకు పైగా థియేటర్లు, ఓవర్సీస్‌లో 110కి పైగా థియేటర్లలో జనవరి 10 విడుదలైంది. ఈ చిత్రం మల్టీప్లెక్స్ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేసినప్పటికీ చాలా చోట్ల మిశ్రమ స్పందన వచ్చింది.
అయితే తొలి వారం కలెక్షన్లు మాత్రం కాస్త సంతృప్తి కరంగానే ఉన్నాయి. ఏపీలో తొలి వారం ఈచిత్రం రూ. 23.73 కోట్ల నెట్ వసూలు చేసింది. రెస్టాఫ్ ఇండియాలో రూ. 3.90 కోట్లు నెట్ రాబట్టింది. ఓవర్సీస్ మార్కెట్లో ఈచిత్రం ఏకంగా రూ. 7.25 కోట్ల నెట్ అమౌంట్ వసూలు చేసింది. వరల్డ్ వైడ్‌గా మొత్తం రూ. 34.88 కోట్లు రాబట్టింది. ఓపెనింగ్ వీక్ కలెక్షన్స్ విషయంలో '1 నేనొక్కడినే' చిత్రం 7వ స్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications











