»   » నమ్రతకు స్పెషల్ ట్రీట్ ఇచ్చిన మహేష్ బాబు

నమ్రతకు స్పెషల్ ట్రీట్ ఇచ్చిన మహేష్ బాబు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రత, పిల్లలు గౌతం, సితారలకు స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఫేమస్ రెస్టారెంట్ ఫలక్‌నుమా ప్యాలెస్‌కు తీసుకెళ్లారు. గత శనివారం మధ్యాహ్నం ఫ్యామిలీతో కలిసి రెస్టారెంటులో సరదాగా గడిపారు.

ఎలైట్ ట్రావెలర్ మ్యాగజైన్ ప్రపంచంలోనే టాప్ రెస్టారెంట్ల కోసం చేసిన ఓ సర్వే ప్రకారం టాప్ రెస్టారెంట్ల జాబితాలో హైదరాబాద్‌లోని ఫలక్‌నుమా ప్యాలెస్ చోటు సంపాదించుకుంది. ప్రపంచంలోని టాప్ 100 జాబితాలో ఫలక్‌నుమా ప్యాలెస్ 100 వ స్థానాన్ని పొందింది. మొదటి సారి ఇండియాలో ఫలక్‌నుమాకు చోటు దక్కింది. దాంతో పాటు న్యూఢిల్లీలోని ఇండియన్ అసెంట్‌ను చూడదగ్గ రెస్టారెంట్‌గా పేర్కొంది. మొదటి స్థానంలో యూఎస్, చికాగోకు చెందిన అలినియా నిలిచింది.

Mahesh Babu's Special Treat to Namrata

ఫలక్ నుమా ప్యాలెస్ రెస్టారెంటులో ఇటీవల వైఎస్ జగన్ తన భార్యకు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు. అంతకు ముందు మంచు ఫ్యామిలీ కూడా అరియానా-వివియానా పుట్టినరోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకున్నారు. గతంలో క్రికెట్ విరాట్ కోహ్లి తన గర్ల్ ఫ్రెండ్ అనుష్క శర్మతో కలిసి తన పుట్టినరోజు వేడుక జరుపుకున్నాడు.

గతేడాది సల్మాన్ ఖాన్ సోదరి అర్పితా ఖాన్ వివాహం కూడా ఈ ప్యాలెస్ లోనే జరిగిన సంగతి తెలిసిందే. అర్పిత ఖాన్ వివాహం ఆయుష్ శర్మతో జరిగింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరైన సంగతి తెలిసిందే.

English summary
Superstar Mahesh Babu has given a special treat to wife Namrata and kids Goutam, Sitara recently at a famous restaurant in Hyderabad. Mahesh was spotted bonding with his family at Falaknuma palace and had nice time.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu