»   »  స్పైడర్ లక్ష్యం 500 కోట్లు.. రిలీజ్‌కు ముందే దుమ్ము రేపుతున్న ప్రిన్స్ మహేశ్

స్పైడర్ లక్ష్యం 500 కోట్లు.. రిలీజ్‌కు ముందే దుమ్ము రేపుతున్న ప్రిన్స్ మహేశ్

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ప్రిన్స్ మహేశ్‌బాబు, ప్రముఖ దర్శకుడు మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం స్పైడర్. ఈ చిత్రం విడుదలకు ముందే భారీ హైప్‌ను క్రియేట్ చేస్తూ రికార్డుల దిశగా దూసుకెళ్తున్నది. బాహుబలి చిత్రం తర్వాత అత్యధిక స్క్రీన్లలో రిలీజ్ కానున్న చిత్రంగా స్పైడర్ ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. కేవలం స్వదేశంలోనే కాకుండా ఓవర్సీస్‌లో అత్యధిక కేంద్రాల్లో విడుదలవుతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన విషయాలు చాలా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

  300 స్క్రీన్లలో..

  300 స్క్రీన్లలో..

  అమెరికాలో స్పైడర్ చిత్రం సుమారు 300 స్కీన్లలో విడుదలవుతున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు బాలీవుడ్ చిత్రాలు దిల్‌వాలే, దంగల్, బాహుబలి2 చిత్రాలు మాత్రమే 300 స్కీన్లలో విడుదలయ్యాయి. ఆ తర్వాత అదే స్థాయిలో విడుదలవుతున్న చిత్రంగా స్పైడర్ ఓ ఘనతను సొంతం చేసుకొన్నది.

  8 కోట్లు చెల్లించి..

  8 కోట్లు చెల్లించి..

  స్పైడర్ చిత్రం అమెరికా పంపిణీలో హక్కులను ఆట్మస్, ఏజెడ్ ఇండియా మీడియా దాదాపు రూ.8 కోట్లు చెల్లించి దక్కించుకొన్నాయి. ఈ చిత్ర ప్రమోషన్‌లో ఏటీ అండ్ టీ, సినీమార్క్ థియేటర్స్, ఏంఎమ్సీ, ఫాండాగో ఇతర సంస్థలు పాలుపంచుకొంటున్నాయి. టికెట్లపై రాయితీలను కూడా ప్రకటించాయి. తెలుగు, తమిళ రాష్రాల్లో కంటే ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 26నే ఈ చిత్రం విడుదల అవుతున్నది.

  అడ్వాన్స్ బుకింగ్ క్లోజ్డ్

  అడ్వాన్స్ బుకింగ్ క్లోజ్డ్

  స్పైడర్ అడ్వాన్స్ బుకింగ్ అమెరికాలో విశేష స్పందన లభిస్తున్నది. శుక్రవారం నాటికి 5 లక్షల డాలర్ల మేర టికెట్లు అమ్ముడుపోయాయి. చాలా హాళ్లలో అడ్వాన్స్ బుకింగ్ క్లోజ్ అయింది. పలు స్కీన్ల వద్ద టికెట్స్ సోల్డ్ అవుట్ అనే బోర్డులు దర్శనమివ్వడం ఈ చిత్రంపై ఉన్న క్రేజ్‌కు అద్దం పట్టింది. అమెరికాలో ప్రీమియర్ షో పడే 26వ తేదీ రాత్రి వరకే స్పైడర్ ఒక మిలియన్ డాలర్ల మార్కును సులభంగా దాటేస్తుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

  అరబిక్ భాషలో

  అరబిక్ భాషలో

  ప్రిన్స్ మహేశ్ బాబు కెరీర్లోనే మునుపెన్నడూ లేని విధంగా స్పైడర్ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, అరబిక్ భాషల్లో విడుదలవుతున్నది. తమిళ, మలయాళంలో నేరుగా మహేశ్ బాబు సినిమా రిలీజ్ కావడం ఇదే ప్రథమం. ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధించే అవకాశాలున్నాయని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.

  కలెక్షన్లు సునామీలా..

  కలెక్షన్లు సునామీలా..

  స్పైడర్‌పై భారీ అంచనాలు ఉండటం, ఒకవేళ తొలిరోజే సానుకూలంగా టాక్ వస్తే ఈ సినిమా కలెక్షన్లు సునామీలా ఉంటాయనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నాయి. బుధవారమే (27న) స్పైడర్ రిలీజ్ కావడం, ఆ తర్వాత అక్టోబర్ 2 వరకు అన్నీ సెలవు దినాలు ఉండటం ఈ చిత్రానికి కలిసి వచ్చే అంశం.

  మురుగదాస్ సూపర్ మార్కెట్

  మురుగదాస్ సూపర్ మార్కెట్

  స్పైడర్ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్ల పరంగా దుమ్ము రేపడం ఖాయమనే మాట వినిపిస్తున్నది. ఎందుకంటే తమిళ, మలయాళం, హిందీలో దర్శకుడు మురుగదాస్‌కు మంచి మార్కెట్ ఉంది. ఆయన రూపొందించిన హిందీ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి. మలేషియా, సింగపూర్, మస్కట్, ఇతర ప్రదేశాల్లో తమిళ, తెలుగు ప్రేక్షకులు భారీగానే ఉన్నారు.

  హిట్ టాక్ వస్తే..

  హిట్ టాక్ వస్తే..

  ఒకవేళ స్పైడర్ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొంటే దాదాపు రూ.500 కోట్లు కొల్లగొట్టే అవకాశం ఉందని ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు. తమిళ, తెలుగు భాషల్లో కలిపి సుమారు 800 స్క్రీన్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. బాహుబలి2 చిత్రం 1000 స్క్రీన్లలో రిలీజైన సంగతి తెలిసిందే.

  తమిళంలో కూడా సూపర్‌స్టార్.

  తమిళంలో కూడా సూపర్‌స్టార్.

  ఇప్పటివరకు ఆయన తెలుగులోనే సూపర్‌స్టార్. కానీ స్పైడర్ తర్వాత కోలివుడ్‌లో కూడా సూపర్ స్టార్ అవుతారు. బాక్సాఫీస్ ఆయన రికార్డు రాకెట్ వేగంతో దూసుకెళ్తుంది. తమిళంలో కూడా సినిమాలు చేయాలని మహేశ్ వెంట పడుతారు అని ఇటీవల దర్శకుడు మురుగదాస్ చెప్పడం విశేషం.

  మెగాస్టార్ రికార్డుపై ప్రిన్స్ నజర్

  మెగాస్టార్ రికార్డుపై ప్రిన్స్ నజర్

  మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ఖైదీ నెం.150 కూడా ఓవర్సీస్‌లో జనవరి 10న మంగళవారమే విడుదలయింది. తద్వారా ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్ల ద్వారానే 12,70,29 డాలర్లు (8 కోట్ల 65 లక్షలు) కొల్లగొట్టింది. ఈ రికార్డును స్పైడర్ బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయని ఓవర్సీస్ విశ్లేషకులు చెబుతున్నారు. బాహుబలి-2 సినిమాకు ఓవర్సీస్ ప్రీమియర్ల ద్వారా 3 మిలియన్ డాలర్ల పైగానే కలెక్షన్లు వచ్చాయి. ఓవర్సీస్ ప్రీమియర్ కలెక్షన్లలో నాన్ బాహుబలి రికార్డులను స్పైడర్ బ్రేక్ చేసి.. మహేశ్ కెరీర్‌లోనే నెం.1 సినిమాగా నిలవడం ఖాయమని అంచనా వేస్తున్నారు.

  English summary
  September 27 is the date that might write many new records in the history of Tollywood. Prince Mahesh Babu who has a massive fan base in the United States of America, could arguably be named as the biggest Telugu star in terms of craze and market value in the same region. Mahesh's previous blockbuster, Srimanthudu, had grossed around 2.9 M and still holds the tag of Non-Baahubali record.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more