For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఈసారి అలా జరుగొద్దు: మహేష్ బాబు వార్నింగ్?

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: మహేష్ బాబు సినిమా అంటే ఫ్యామిలీ మొత్తం చూసే విధంగా బావుంటాయి అనే బ్రాండ్ నేమ్ ఉంది. అందుకే ఆయన సినిమా విడుదలైంది అంటే ఇంటిల్లి పాదీ కలిసి వెళతారు. ఫ్యామిలీ ఆడియన్స్‌కు కావాల్సిన మసాలా ఉంటే చాలు ఆయన సినిమా హిట్టే. అయితే 2014 సంవత్సరం మాత్రం మహేష్ బాబుకు కలిసి రాలేదు. ఆయన చేసిన రెండు సినిమాలు బాక్సాపీసు వద్ద బోల్తా పడ్డాయి. ఈ రెండు చిత్రాల్లో ఫ్యామిలీ ఎలిమెంట్స్ లేక పోవడమే ఇందుకు కారణం.

  గత సంవత్సరం అనుభవాలను, అంతకు ముందు తన హిట్ చిత్రాలను బేరీజు వేసుకున్న మహేష్ బాబు ఈ సారి నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ మెచ్చే అంశాలకు పెద్ద పీట వేస్తూ, మాస్ ఆడియన్స్ కూడా సంతృప్తి పరిచేలా ప్లాన్ చేసున్నాడు. ఈ సారి ఎట్టి పరిస్థితుల్లోనూ బాక్సాపీసు వద్ద టార్గెట్ మిస్ కాకూడదని వార్నింగ్ ఇచ్చాడట మహేష్ బాబు.

  ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఇప్పటి వరకు టైటిల్ అయితే ఖరారు కాలేదు. ఆ మధ్య పలు టైటిల్స్ వినిపించినా...అవేవీ కాదని కొట్టిపారేసారు దర్శకుడు శివ.

  Mahesh Babu's Target?

  అయితే తాజాగా మరో టైటిల్ ప్రచారంలోకి వచ్చింది. ‘శ్రీమంతుడు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంతో దర్శకుడు కొరటాల శివ తేల్చాల్సి ఉంది. ఈ విషయం విన్న ఫ్యాన్స్ ఈ టైటిల్ మహేష్ బాబు ఇమేజ్ కు తగిన విధంగా లేదని అంటున్నారు. ఈ టైటిల్ విషయమై కొరటాల శివ త్వరలోనే సోషల్ నెట్వర్కింగులో స్పందించే అవకాశం ఉంది.

  కథపై పూర్తి కసరత్తు చేసి మరీ కొరటాల శివ కసిగా రంగంలోకి దిగాడంటున్నారు. హిట్ ఖాయం అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ''భారీ హంగులతో తెరకెక్కుతున్న చిత్రమిది. మహేష్‌ శైలికి తగ్గట్టుగా ఫ్యామిలీ అండ్ మాస్‌ అంశాల్ని మేళవించి కథను సిద్ధం చేశారు దర్శకుడు. అందరికీ నచ్చే ఓ మంచి సినిమా అవుతుంది''అని చెబుతున్నారు నిర్మాతలు.

  ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్. ఛాయాగ్రహణం: ఆర్‌.మది, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు.

  English summary
  Though Prince did try to win them over with mass films, he has had mixed results. The more he experimented, more was the loss for his films. And that was also one of the reasons why 2014 turned out to be a nightmare of sorts for Mahesh.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X