»   » ప్రిన్స్ మహేశ్ సినిమా టీజర్ సంచలనం.. ముంబైలో..

ప్రిన్స్ మహేశ్ సినిమా టీజర్ సంచలనం.. ముంబైలో..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రిన్స్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రానికి సంబంధించిన చిత్రాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. సంచలన దర్శకుడు మురుగదాస్ రూపొందిస్తున్న ఈ చిత్రానికి సంభవామి, ఏజెంట్ గోపి అనే పేర్లు పెట్టినట్టు ప్రచారం జరుగుతున్నది. వంద కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హ్యారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.

బాహుబలి, రోబోకు దీటుగా..

బాహుబలి, రోబోకు దీటుగా..

బహుబలి2, రోబో 2.0 చిత్రాలకు దీటుగా సంభవామి టీజర్ రూపొందించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రిన్స్ మహేశ్ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను బ్రిటన్‌కు చెందిన గ్రాఫిక్ కంపెనీ రూపొందిస్తున్నది. భారీ వేడుకను నిర్వహించి ఈ టీజర్‌ను అట్టహాసంగా విడుదల చేయాలని నిర్మాత నిర్ణయించారు.

30 సెకన్ల టీజర్ కోసం 35 లక్షలు

30 సెకన్ల టీజర్ కోసం 35 లక్షలు

దాదాపు 30 సెకన్లు నిడివి ఉంటే టీజర్ కోసం రూ.35 లక్షలు ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఈ టీజర్‌ రూపకల్పనలో రాజీ పడకూడదనే అభిప్రాయాన్ని నిర్మాత వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది. అత్యాధునిక సాంకేతికతతో హెచ్ డీ క్వాలిటీలో నిర్మిస్తున్నట్టు తెలిసింది.

రకుల్ హీరోయిన్.. ఎస్‌జే సూర్య విలన్

రకుల్ హీరోయిన్.. ఎస్‌జే సూర్య విలన్

రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌జే సూర్య విలన్‌గా కనిపిస్తారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ప్రముఖ దర్శకుడు సంతోష్ శివన్ వ్యవహరిస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రూపకల్పన టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ముంబైలో ప్రిన్స్ ఇంట్రడక్షన్ సీన్ల షూటింగ్

ముంబైలో ప్రిన్స్ ఇంట్రడక్షన్ సీన్ల షూటింగ్

ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను ముంబైలో చిత్రీకరిస్తున్నారు. మహేశ్ బాబు ఇంట్రడక్షన్ సీన్లను ఇమాజికా పార్క్‌లో షూట్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జూన్ రెండో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

ప్రత్యేక పాత్రలో నమ్రత

ప్రత్యేక పాత్రలో నమ్రత

ఈ చిత్రంలో మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. ప్రిన్స్ సరసన ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారనే రూమర్ వైరల్‌గా మారింది. అయితే అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. చిత్ర నిర్వాహకులు ప్రకటన చేస్తే గానీ రూమర్ తెరపడే అవకాశం లేదు.

English summary
AR Murugadoss' Telugu-Tamil bi-lingual with Mahesh Babu is currently being shot in Mumbai. Rs. 100 Cr movie that the Teaser becomes the talk of the town to the exclusion of others, getting the Teaser made by a UK-based graphics company.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu