»   » కొడుకును హయ్యెస్ట్ పాయింటులో నిలబెట్టిన మహేష్ బాబు (ఫోటో)

కొడుకును హయ్యెస్ట్ పాయింటులో నిలబెట్టిన మహేష్ బాబు (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు గత కొన్ని రోజులుగా ఫ్యామిలీతో కలిసి పారిస్ ట్రిప్పులో ఉన్న సంగతి తెలిసిందే. పారిస్ వెళ్లిన వారంతా తప్పకుండా ఈఫిల్ టవర్ సందర్శిస్తారు. తాజాగా మహేష్ బాబు ఫ్యామిలీ కూడా ఈఫిల్ టవర్ సందర్శించడంతో పాటు దాన్ని ఎక్కారు. ఈఫిల్ టవర్ లోని హయ్యెస్ట్ పాయింటు వద్ద గౌతం కృష్ణను నెలబెట్టి ఫోటో తీసిన మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా దాన్ని అభిమానులకు షేర్ చేసారు.

‘ఈఫిల్ టవర్ లోని హయ్యెస్ట్ పాయింట్ వద్ద ఉన్నాం. మేడ్ మై సన్ డే.... ఫీల్స్ గుడ్' అంటూ మహేష్ బాబు ట్వీట్ చేసారు.

మహేష్ బాబు కేవలం తన కెరీర్ కే కాక తన కుటుంబానికి తగినంత ప్రయారిటీ ఇస్తూంటారు. అందులో భాగంగా ఏ మాత్రం గ్యాప్ దొరికినా వెంటనే ఫ్యామిలీతో విదేశీ ట్రిప్ ప్లాన్ చేస్తూంటారు. అలాగే ఇఫ్పుడు బ్రహ్మోత్సవం చిత్రం షూటింగ్ గ్యాప్ దొరకటంతో ఆయన కుటుంబాన్ని తీసుకుని ప్యారిస్ వెళ్లారు. ఓ రకంగా పిల్లలు దసరా హాలీడేస్ ప్యారిస్ లో గడుపుతున్నారన్నమాట.

ఆ మేరరు ఈ ట్రిప్ కు సంభించిన కొన్ని ఫొటోలను మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఇనిస్టిగ్రామ్ లో పోస్ట్ చేసారు. ఈ ఫొటోలను సూపర్ స్టార్ అభిమానులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. మహేష్ బాబు ఈ మధ్య కాలంలో తన జోరు పెంచి చాలా చాలా బిజీగా ఉన్నారు. ఓ ప్రక్కన కంటిన్యూ షెడ్యూల్స్. మరో ప్రక్కన యాడ్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఖాళీ సమయాల్లో కొత్త కథలు వినటం, తనను కలవటానికి వచ్చే దర్శక, నిర్మాతలతో మీటింగ్ లు వంటివి ఆయన్ను గ్యాప్ కొంచెం కూడా ఉండనివ్వటం లేదు. అంతేకాకుండా ఈ మధ్యలో ఫ్యాన్స్ తో ఆయన గడిపేందుకు కూడా సమయం కేటాయిస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ ఫ్యామిలీకి ఇదిగో ఇలా ప్రయారిటీ ఇస్తున్నారు.

English summary
"At the highest point In the Eiffel !! Made my sons day 👍👍.. Feels good :) " Mahesh Babu tweeted.
Please Wait while comments are loading...