»   » సూపర్ స్టార్ కృష్ణ కు మహేష్ బాబుకు పోటా పోటినా..!?

సూపర్ స్టార్ కృష్ణ కు మహేష్ బాబుకు పోటా పోటినా..!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

'అతిథి" తర్వాత మహేష్‌ నటించిన చిత్రం ఇప్పటివరకూ విడుదల కాకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇలా గ్యాప్‌ తీసుకోవడానికి కారణాలు... అలాగే కొన్ని మనోభావాలను ఇటీవల ఓ సందర్భంలో ఈ విధంగా పంచుకున్నారు మహేష్‌. అమ్మమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఆమె చనిపోయిన ప్రభావం నా మీద చాలా పడింది. ఆ షాక్‌ నుంచి కొంచెంకొంచెం తేరుకుంటున్నాను అనుకుంటున్న సమయంలో నమ్రత తల్లిదండ్రులు చనిపోయారు. దాంతో మా మానసిక పరిస్థితి చాల దారుణంగా ఉండేది. ఆ ప్రభావం'ఖలేజా"పై పడింది. కానీ ప్రేక్షకులకు నేను ఒక ప్రామిస్‌ చేస్తున్నాను. 'ఖలేజా" ఎవర్నీ నిరాశపరచదు. సినిమా బాగా వచ్చింది. అలాగే ఇక నుంచి సంవత్సరానికి రెండు, మూడు సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ వివరించారు.

ప్రిన్స్‌ మహేష్‌ బాబు తన పుట్టినరోజు వేడుకలను ఆగస్ట్‌ 9న అభిమానుల సమక్షంలో ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. అలాగే తమ కొడుకు పుట్టిన రోజు సందర్భంగా సూపర్‌ స్టార్‌ దంపతులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే ఆగస్ట్‌ 31వ తేదీన ప్రిన్స్‌ మహేష్‌ బాబు తన తనయుడి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ బర్త్‌ డే వేడుకను మాత్రం గోవాలో ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. కృష్ణ దంపతులు తమ కొడుకు పుట్టినరోజుకు ఘనంగా చేస్తే... మహేష్‌ దంపతులు తమ కొడుకు పుట్టినరోజును అంతకంటే ఘనంగా చేయడానికి ప్లాన్‌ చేస్తున్నారని సమాచరం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu