మహేష్ బాబు ఫ్యామిలీని గర్వపడేలా చేసిన తనయుడు గౌతమ్.. టాప్ 10లో ఒకడిగా..
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల వారసులపై అభిమానులు ఫోకస్ కాస్త గట్టిగానే ఉంటుంది. కాస్త టీనేజ్ లోకి వచ్చారంటే చాలు వారికి సంబంధించిన ఫొటోలు వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక ఘట్టమనేని మూడవ తరం గౌతమ్ బాబు కోసం కూడా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఒక పోటీలో గౌతమ్ జిల్లాలోనే టాప్ 10లో ఒకడిగా ఉండడం హాట్ టాపిక్ గా మారింది.

చిన్నతనంలోనే
ఘట్టమనేని కృష్ణ వారసత్వం నుంచి వచ్చిన మహేష్ బాబు చిన్నతనంలోనే వెండితెరకు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. పసితనంలోనే నటుడిగా రాటు దేలిన మహేష్ అనంతరం తన కొడుకును కూడా కాస్త చిన్నతనంలోనే వెండితెరపైకి తీసుకు వచ్చాడు. కానీ అది ఒక్క సినిమా వరకే జరిగింది.

అప్పుడే అర్ధమయ్యింది
వన్ నేనొక్కడినే సినిమాలో గౌతమ్ చిన్నప్పటి మహేష్ బాబు పాత్రలో నటించిన విషయం తెలిసిందే. కొన్ని సీన్స్ లో గౌతమ్ చాలా ఎమోషనల్ గా కనిపించడంతో తప్పకుండా హీరోగా ఎంట్రీ ఇవ్వడం కాయమని అందరికి తెలిసిపోయింది. మంచి యాక్టర్ అవుతాడాని కొంతమంది సినీ ప్రముఖులు కూడా పాజిటివ్ గా కామెంట్స్ చేశారు.

సోషల్ మీడియాకు దూరంగా
ఇక గౌతమ్ సోషల్ మీడియాకు చాలా దూరంగానే ఉంటున్నాడు. కూతురు సితార తన సరికొత్త టాలెంట్ తో ఇప్పటికే సోషల్ మీడియాలో భారీగా ఫాలోవర్స్ ను సంపాదించుకుంది. కానీ గౌతమ్ మాత్రం ప్రయివేట్ లైఫ్ ను ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. ఎప్పుడైనా నమ్రత శిరోద్కర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే గాని ఫొటోలు బయటకు రావు.
Recommended Video
టాప్ 10లో ఒకడిగా..
ఇక రీసెంట్ గా గౌతమ్ ఒక ఘనతను సాధించినట్లు నమ్రత వివరణ ఇచ్చారు. తెలంగాణ జిల్లాలో తన వయసుతో ఉన్న టాప్ 10 స్విమ్మర్స్ లలో గౌతమ్ 8వ స్థానంలో ఉన్నట్లు చెప్పారు. స్విమ్మింగ్ అంటే మొదటి నుంచి కూడా గౌతమ్ కు చాలా ఇష్టమట. మిగతా ఆటల కంటే కూడా గౌతమ్ స్విమ్మింగ్ ను చాలా లైక్ చేస్తున్నాడట. మరి భవిష్యత్తులో గౌతమ్ తన ర్యాంక్ ను ఇంకా ఏ స్థాయికి పెంచుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











